చెప్పను బ్రదర్‌.. ఆ 70 కోట్ల కోసమా??

Update: 2016-05-17 15:30 GMT
టాలీవుడ్‌ లో ఉన్న పెద్ద హీరోల్లో.. కొంతమంది బ్రాండింగ్‌ స్ర్టాటజీలే చాలా డిఫరెంటుగా ఉంటాయి. మనోళ్ళు.. తమ సినిమాల్లో కంటెంట్‌ యావరేజ్ గా ఉన్నా కూడా.. వాటిని ప్రమోట్‌ చేసిన తీరుతో కలక్షన్ల వర్షం కురుస్తోంది. ఒక విధంగా చూస్తే.. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకంటే నాన్నకు ప్రేమతో సినిమాలో చాలా కథ ఉంటుంది. అయినా కూడా బాక్సాఫీస్‌ దగ్గర సోగ్గాడు డామినేట్‌ చేశాడు. ప్రమోషనల్‌ స్ర్టాటజీ ఈ సినిమా విషయంలో బాగా వర్కవుట్‌ అయ్యింది కాబట్టే అంతేసి కలక్షన్ వచ్చింది. మరి అల్లు అర్జున్‌ కూడా ఇలాంటి ఫీటే ఏదైనా చేశాడా?

నిజానికి ''సరైనోడు'' సినిమా పంపిణీదారులు ఖర్చుపెట్టిన దాదాపు 54 కోట్లు డబ్బులు వసూలు చేస్తుందా లేదా అని అప్పట్లో సందేహాలు వచ్చాయి. కాని ఇప్పుడు 25 రోజుల రన్ తరువాత ఈ సరైనోడు సరిగ్గా 68+ కోట్లు ''షేర్‌'' వసూలు చేశాడు. అయితే సాధారణంగా కొన్ని సినిమాలు ఒక లెవెల్‌ కు రాగానే అవి సాట్యురేషన్‌ పాయింట్‌ కు చేరుకుంటాయి. కాని సరైనోడు మాత్రం అలాంటివేం లేకుండా సాగిపోతున్నాడు. దానికి కారణం.. సినిమా రిలీజ్‌ అయ్యినప్పటి నుండీ రోజుకో ఇంటర్యూ వీడియో రావడమే. అదీ కాకుండా.. ''చెప్పను బ్రదర్‌'' కాంట్రోవర్శీ బాగా ఉపయోగపడుతోంది. బన్నీ ఎప్పుడూ న్యూస్ లోనే ఉంటున్నాడు. అసలు ఈ కాంట్రవర్శీని 70 కోట్ల షేర్‌ మార్కును టచ్‌ చేయడానికే బన్నీ మొదలెట్టాడేమో అని సందేహాలు వచ్చేసేలా.. కలక్షన్లు ప్రవహిస్తున్నాయి.

ఇకపోతే.. కేవలం ప్రచారం కారణంగానే సినిమాలు వసూళ్ళ పరవళ్ళు తొక్కవులే. కంటెంట్‌ కూడా ముఖ్యమే. బన్నీ 'సరైనోడు' జనాలకు బాగా నచ్చేసిందనేది వాస్తవం. డాట్‌.
Tags:    

Similar News