సరైనోడు విడుదలకు ముందు ప్రి రిలీజ్ ఫంక్షన్ వైజాగ్ లో పెట్టినపుడు అల్లు అరవింద్ తన కొడుకు అల్లు అర్జున్ కు ఉత్తరాంధ్ర ప్రేక్షకులు ఏ స్థాయిలో బ్రహ్మరథం పడుతున్నారో చెబుతూ.. కలెక్షన్ల రికార్డుల వివరాలు వెల్లడించాడు. బన్నీ సినిమా సినిమాకూ ఇక్కడ మార్కెట్ పెంచుకుంటున్నాడని.. రికార్డులన్నీ బద్దలైపోతున్నాయని.. ‘సరైనోడు’ దాన్ని మించి విజయం సాధించాలని అన్నాడు. ఆయన మాటే నిజమైంది. అల్లు అర్జున్ కెరీర్లోనే కాదు.. టాలీవుడ్ చరిత్రలోనే ‘సరైనోడు’ ఉత్తరాంధ్రలో అతి పెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ ఈ సినిమా అనూహ్యంగా రూ.8 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం విశేషం. ఈ ఫిగర్ చూస్తే ఉత్తరాంధ్రలో నెంబర్ వన్ టాలీవుడ్ హీరో బన్నీనే అని తీర్పిచ్చేయాలి.
‘సరైనోడు’ కాకుండా ఈ ఏరియాలో అత్యధిక వసూళ్లు సాధించింది బాహుబలి మాత్రమే. ఆ చిత్రం రూ.9.7 కోట్ల షేర్ సాధించింది. దాని తర్వాత బిగ్గెస్ట్ హిట్ అయిన ‘శ్రీమంతుడు’కి ఇక్కడ రూ.5.6 కోట్ల షేరే వచ్చింది. ఐతే ‘సరైనోడు’ దాన్ని చాలా పెద్ద మార్జిన్ తో క్రాస్ చేయడం విశేషం. ఎంత పెద్ద హిట్టయినా ఓ ఆరు కోట్లొస్తే ఎక్కువ అనుకున్నారు కానీ.. ఏకంగా రూ.8 కోట్ల మార్కును అందుకోవడం అన్నది అనూహ్యం. పవన్ కళ్యాణ్ సహా ఇంకే స్టార్ కూడా ఈ ఘనత సాధించలేదు. ‘బాహుబలి’ అన్నది స్పెషల్ మూవీ కాబట్టి దాన్ని పక్కనబెట్టేసి చూస్తే ఉత్తరాంధ్రలో బన్నీనే ప్రస్తుతం నెంబర్ వన్ హీరో అని ఒప్పుకోవాల్సిందే. మెగా హీరోల సినిమాలకు మామూలుగానే ఇక్కడ ఫాలోయింగ్ ఎక్కువ. ఐతే వరుస సక్సెస్ లతో మిగతా మెగా హీరోల్ని దాటుకుని ముందుకెళ్లిపోతున్నాడు బన్నీ.