బన్నీని అను అడిగిన ఆ సెల్ఫీ

Update: 2018-04-19 04:35 GMT
ఓ భారీ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో.. ఆ మూవీలోని హీరోయిన్ ఎలాంటి డిమాండ్స్ అయినా చేసే అవకాశం ఉంది. వీలయినంత వరకూ వీటిని పూర్తి చేసేందుకే హీరో.. నిర్మాత ట్రై చేయడం సహజం. ఇక షూటింగ్ పూర్తయిపోయిన సందర్భంగా అయితే.. చెప్పుకోదగ్గ స్థాయిలో గిఫ్టులు ఇచ్చి పుచ్చుకోవడం కూడా కనిపిస్తూ ఉంటుంది.

ఇప్పుడు అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా షూటింగ్ పూర్తయిపోయింది. చివరగా హీరో-హీరోయిన్ అను ఇమాన్యుయేల్ మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ను.. స్పెషల్ గా హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ ను పట్టుకొచ్చి మరీ షూట్ చేశారు. ఇది కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోగా.. సినిమా షూటింగ్ అయిపోయిన సందర్భంగా బన్నీని అను ఇమాన్యుయేల్ ఒక కోరిక కోరిందట. ఈ సినిమా షూటింగ్ మొత్తంలో అను అడిగిన మొదటి మరియు చివరి గిఫ్ట్ ఇదే కావడంతో వెంటనే ఆ కోరిక తీర్చేశాడు బన్నీ. అదేంటో కాదు.. బన్నీతో కలిసి ఓ సెల్ఫీ దిగడమే.

'నా తోటి నటి అను ఇమాన్యుయేల్ అడిగిన ఫస్ట్ అండ్ లాస్ట్ థింగ్.. నాతో ఒక సెల్ఫీ దిగడం. సో స్వీట్. అను ఇమాన్యుయేల్ తో నా తొలి సెల్ఫీ. మూవీ షూట్ లో ఇదే లాస్ట్ షాట్' అంటూ ఆ సెల్ఫీని ఆన్ లో పోస్ట్ చేసిన అల్లు అర్జున్.. అటు తన స్టైలింగ్ తో పాటు.. ఇటు హీరోయిన్ మెరంపులను కూడా చూపించాడు. అలాగే నా పేరు సూర్య షూటింగ్ పూర్తయిపోయిందని ఇన్ డైరెక్టుగా చెప్పాడు బన్నీ.


Tags:    

Similar News