సైమాలో పుష్ప‌రాజ్ దే హ‌వా!

Update: 2022-09-12 13:30 GMT

సౌత్ ఇండియన్ సినిమాల‌కు, న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణులకు వారి ప్ర‌తిభ‌ను గుర్తిస్తూ అందించే ప్ర‌తిష్టాత్మ‌క అవార్డ్స్ `సౌత్ ఇండియన్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్ (సైమా)`. గ‌త తొమ్మిదేళ్లుగా సౌత్ ఇండియా స్టార్స్ కి అవార్డుల్ని అందిస్తున్న సైమా తాజాగా 10వ వార్షికోత్స‌వాన్ని బెంగ‌ళూరులో శని, ఆదివారాలు నిర్వ‌హించారు. శ‌నివారం తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల‌కు చెందిన స్టార్ ల‌కు, టెక్నీషియ‌న్ ల‌కు అవార్డులు అంద‌జేశారు.

బెంగ‌ళూరులో అట్ట‌హాసంగా జ‌రిగిన ఈ వేడుక‌లో టాలీవుడ్ , కోలీవుడ్ కు సంబంధించిన టాప్ స్టార్స్‌, టాప్ టెక్నీషియ‌న్స్ పాల్గొన్నారు. సైమా ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప ది రౌస్‌` హ‌వా కొన‌సాగింది. గ‌తేడాది ఐదు భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన ఈ మూవీ హిందీ బెల్ట్ లోనూ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేసింది.

సైమా అవాన్డుల్లో `పుష్ప‌` 12 విభాగాల్లో పోటీప‌డి నామినేష‌న్స్ ద‌క్కించుకోగా ఆరింటిలో అవార్డుల్ని ద‌క్కించుకుంది.  ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు, ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు, ఉత్త‌మ స‌హాయ న‌టుడు, ఉత్త‌మ గేయ ర‌చ‌యిత విభాగాల్లో అవార్డులు ద‌క్కాయి. శ‌నివారం జ‌రిగిన సైమా అవార్డుల వేడుక‌ల్లో అల్లు అర్జున్ తో పాటు బాలీవుడ్ హీరో ర‌ణ్ వీన్ సింగ్‌, క‌న్న‌డ స్టార్ య‌ష్ ..ఎంతో మంది స్టార్స్ అవార్డుల్ని అందుకుని అవార్డుల వేడుక‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

సైమా అవార్డ్స్ అందుకున్న తెలుగు, త‌మిళ ,క‌న్న‌డ‌, మ‌ల‌యాళ ఇడ‌స్ట్రీ విజేత‌లు విరే..

తెలుగు సినిమా విజేత‌లు:

ఉత్త‌మ చిత్రం : పుష్ప : ది రైజ్‌

ఉత్త‌మ న‌టుడు అల్లు అర్జున్ (పుష్ప : ది రైజ్‌)

ఉత్త‌మ న‌టుడు (క్రిటిక్స్‌) :  న‌వీన్ పొలిశెట్టి (జాతిర‌త్నాలు)

ఉత్త‌మ న‌టి :  పూజా హెగ్డే ( మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌)

ఉత్త‌మ స‌హాయ న‌టుడు : జ‌గ‌దీష్ ప్ర‌తాప్ బండారి (పుష్ప : ది రైజ్‌)

ఉత్త‌మ స‌హాయ న‌టి : వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ (క్రాక్‌)

ఉత్త‌మ క‌మేడియ‌న్ : సుద‌ర్శ‌న్ (ఏక్ మినీ క‌థ‌)

ఉత్త‌మ ద‌ర్శ‌కుడు : సుకుమార్ (పుష్ప : ది రైజ్‌)

ఉత్త‌మ నూత‌న దర్శ‌కుడు : బుచ్చిబాబు సానా (ఉప్పెన‌)

ఉత్త‌మ సినిమాటోగ్రాఫ‌ర్ సి. రామ్‌ప్ర‌సాద్ (అఖండ‌)

ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ‌ప్ర‌సాద్ (పుష్ప : ది రైజ్‌)

ఉత్త‌మ నూత‌న న‌టి : కృతిశెట్టి (ఉప్పెన‌)

ఉత్త‌మ నేప‌థ్య గాయ‌ని : గీతా మాధురి (అఖండ లోని జై బాల‌య్య గీతం)

ఉత్త‌మ నేప‌థ్య గాయ‌కుడు రామ్ మిరియాల ( `జాతిర‌త్నాలు` లోని చిట్టీ నీ మాటంటే.. గీతానికి)

ఉత్త‌మ గేయ ర‌చ‌యిత చంద్ర‌బోస్ (పుష్ప : ది రైజ్ నుంచి శ్రీ‌వ‌ల్లి పాట‌కుగానూ)

త‌మిళ‌ సినిమా విజేత‌లు:

ఉత్త‌మ న‌టి : కంగ‌నా ర‌నౌత్ (త‌లైవి)

ఉత్త‌మ న‌టి (క్రిటిక్స్ విభాగం) : ఐశ్వ‌ర్యా రాజేష్‌

ఉత్త‌మ న‌టుడు (క్రిటిక్స్ విభాగం): ఆర్య‌

ఉత్త‌మ న‌టుడు : శివ కార్తీకేయ‌న్

ఉత్త‌మ న‌టుడు : సిలంబ‌ర‌స‌న్ (శింబు)

ఉత్త‌మ చిత్రం : స‌ర్పట్ట ప‌రంబ‌రై

ఉత్త‌మ ద‌ర్శ‌కుడు : లోకేష్ క‌న‌గ‌రాజ్

ఉత్త‌మ నూత‌న న‌టి : ప్రియాంక అరుళ్ మోహ‌న్‌

ఉత్త‌మ ప్ర‌తినాయ‌కుడు : ఎస్‌.జె. సూర్య‌

ఉత్త‌మ హాస్య న‌టుడు : రెడిన్ కింగ్స్ లే, దీపా శంక‌ర్‌

ఉత్త‌మ స‌హాయ న‌టి : ల‌క్ష్మీ ప్రియా చంద్ర‌మౌళి

ఉత్త‌మ నూత‌న దర్శ‌కుడు : మ‌డోన్ అశ్విన్‌

ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు : సంతోష్ నారాయ‌ణ‌న్‌

ఉత్త‌మ నేప‌థ్య గాయ‌ని : ఢీ

ఉత్త‌మ నేప‌థ్య గాయ‌కుడు : క‌పిల్ క‌పిల‌న్‌

ఉత్త‌మ సినిమాటోగ్రాఫ‌ర్ : శ్రేయాస్ కృష్ణ‌


క‌న్న‌డ సినిమా విజేత‌లు:

ప్ర‌ధాన పాత్ర‌లో ఉత్త‌మ న‌టుడు : దివంగ‌త పునీత్ రాజ్ కుమార్ (యువ‌ర‌త్న‌)

ప్ర‌ధాన పాత్ర‌లో ఉత్త‌మ న‌టి : అషికా రంగ‌నాథ్ (మ‌ధ‌గ‌జ‌)

ప్ర‌ధాన పాత్ర‌లో ఉత్త‌మ న‌టి (విమ‌ర్శ‌కులు) : అమృతా అయ్యంగార్ (బ‌డ‌వ రాస్కెల్)

ఉత్త‌మ స‌హాయ న‌టుడు :  ప్ర‌మోద్‌

ఉత్త‌మ స‌హాయ న‌టి : ఆరోహి నారాయ‌ణ్ (దృశ్యం 2)

ఉత్త‌మ ప్ర‌తినాయ‌కుడు : ప్ర‌మోద్ శెట్టి

ఉత్త‌మ హాస్య న‌టుడు : చిక్క‌న్న (పొగ‌రు)

ఉత్త‌మ నూత‌న న‌టుడు : నాగ భూష‌ణ‌

ఉత్త‌మ డెబ్యూ న‌టి : శ‌ర‌ణ్య శెట్టి

ఉత్త‌మ ద‌ర్శ‌కుడు : త‌రుణ్ సుధీర్ (రాబ‌ర్ట్‌)

ఉత్త‌మ నూత‌న దర్శ‌కుడు: శంక‌ర్ గురు (బ‌డ‌వ‌రాస్కెల్‌)

ఉత్త‌మ సినిమాటోగ్రాఫ‌ర్ : సుధాక‌ర్ రాజ్‌(రాబ‌ర్ట్‌)

ఉత్త‌మ సంగీత దర్శ‌కుడు :  అర్జున్ జ‌న్య (రాబ‌ర్ట్‌)

ఉత్త‌మ నేప‌థ్య గాయ‌ని :  చైత్ర ఆచార్ (గ‌రుడ‌గ‌మ‌న వృష‌భ వాహ‌న‌)

ఉత్త‌మ నేప‌థ్య గాయ‌కుడు: అర్మాన్ మాలిక్‌, త‌మ‌న్‌

మ‌ల‌యాళ‌ సినిమా విజేత‌లు:

ఉత్త‌మ న‌టి (క్రిటిక్స్‌) : నిమిషా స‌జ‌య‌న్‌

ఉత్త‌మ న‌టుడు (క్రిటిక్స్‌) : బీజు మీన‌న్‌

ఉత్త‌మ న‌టుడు టివినో థామ‌స్‌

ఉత్త‌మ చిత్రం : మిన్నాల్ ముర‌ళీ

ఉత్త‌మ హాస్య న‌టుడు నెల్స‌న్ కె గ‌పూర్‌

ఉత్త‌మ ద‌ర్శ‌కుడు : మ‌హేష్ నారాయ‌ణ్‌

ఉత్త‌మ విల‌న్ : గురు సోమ సుంద‌రం

ఉత్త‌మ న‌టి : ఐశ్వ‌ర్య ల‌క్ష్మి

ఉత్త‌మ స‌హాయ : న‌టుడు బాబూరాజ్‌

ఉత్త‌మ స‌హాన‌టి:  ఉన్నిమ‌య‌ప్ర‌సాద్‌

ఉత్త‌మ నూత‌న ద‌ర్శ‌కురాలు : కావ్య ప్ర‌కాష్‌

ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు : బిజిబాల్ మ‌ణియిల్‌

ఉత్త‌మ నేప‌థ్య గాయ‌ని :  సుజాతా మోహ‌న్

ఉత్త‌మ నేప‌థ్య గాయ‌కుడు : మిథున్ జ‌య‌రాజ్‌

ఉత్త‌మ సినిమాటోగ్రాఫ‌ర్ : నిమిష్ ర‌వి
Tags:    

Similar News