`అల్లు పూల్` అయాన్ కి బర్త్‌డే గిఫ్ట్‌?

Update: 2019-04-03 09:06 GMT
అల్లు ఫ్యామిలీలో న‌ట‌వార‌సుడు రెడీ అయిపోతున్నాడు. అల్లు అయాన్ అప్పుడే ఐదేళ్ల చిన్నారిగా ఎదిగేశాడు. త‌న ఐద‌వ బ‌ర్త్ డే పార్టీని నేడు గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకున్నాడు. డాడ్ అల్లు అర్జున్- మామ్ స్నేహ అయాన్ బ‌ర్త్ డేని గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేశారు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. అల్లు అయాన్ బ‌ర్త్ డే ఫోటోల్ని .. ఈ బ‌ర్త్ డే సంద‌ర్భంగా స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న  బ‌ర్త్ డే బోయ్ ఫోటోల్ని బ‌న్ని, స్నేహ ఇన్ స్టాలో షేర్ చేశారు. ఈ ఫోటోల‌కు ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్స్ ని ఇచ్చారు.

అల్లు అయాన్ స్విమ్మింగ్ పూల్ సెల‌బ్రేష‌న్స్  గురించి బ‌న్ని స్వ‌యంగా వివ‌రాలు అందించారు. ``అయాన్ బ‌ర్త్ డేకి మా నాన్న (అర‌వింద్) స్విమ్మింగ్ పూల్ ని కానుక‌గా ఇచ్చారు. ఇప్ప‌టికీ షాక్ లోనే ఉన్నాను. 45 రోజుల క్రితం అయాన్ ని నాన్న అడిగార‌ట‌. నీ బ‌ర్త్ డేకి ఏం గిఫ్ట్ కావాలి అని .. దానికి అయాన్ `పూల్` కావాల‌ని అడిగాడు. డాడ్ ఓకే చెప్ప‌డ‌మే కాదు స్విమ్మింగ్ పూల్ నే కానుక‌గా ఇచ్చారు. అయాన్ కి ఇలాంటి అల్లూ తాత దొరికినందుకు చాలా ల‌క్కీ. నాలుగో జ‌న‌రేష‌న్ కిడ్స్ చాలా ల‌క్కీ. దీనికి జెల‌సీగా కుళ్లుగా ఉంది. ఈ పూల్ కి మేం పెట్టుకున్న పేరు `అల్లు పూల్`` అని తెలిపారు.

మొత్తానికి అల్లు అయాన్ సెల‌బ్రేష‌న్స్ చూస్తుంటే కుళ్లుకోని వారుంటారా? హాట్ స‌మ్మ‌ర్ లో కూల్ గా స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. అన్న చెంత‌నే క్యూటీ అల్లు అర్హ ఏం చేస్తోందో చూడండి. అన్న బ‌ర్త్ డే కేక్ క‌ట్ చేసి త‌నే లాగించేస్తోంది క్యూట్ గా.. అల్లు అయాన్ బ‌ర్త్ డే 03 ఏప్రిల్ అయితే, అల్లు అర్హ బ‌ర్త్ డే 21 న‌వంబ‌ర్. అర్హ బ‌ర్త్ డేకి తాత అల్లు అర‌వింద్ ఏం గిఫ్ట్ ఇస్తారో ఏంటో!
Tags:    

Similar News