అర్హ‌తో బ‌న్నీ కాల‌క్షేపం ఇలా!

Update: 2022-08-02 16:30 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొద్ది రోజులుగా యాడ్ షూట్స్ లో బిజీగా ఉంటోన్న సంగ‌తి  తెలిసిందే. `పుష్ప` పాన్ ఇండియా స‌క్సెస్  అయిన నేప‌థ్యంలో బ‌న్నీ బ్రాండ్ ఇమేజ్ రెట్టింపు అయింది. దీంతో ప్ర‌ఖ్యాత బ్రాండ్  సంస్థ‌ల‌న్ని బ‌న్నీ వెంట ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో బ‌న్నీ వాటిని పూర్తిచేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. దాదాపు నాలుగైదు నెల‌లుగా అదే ప‌నిలో బిజీగా ఉన్నారు.

షూట్ లో భాగంగా ఇత‌ర  దేశాల‌కు  వెళ్లాల్సి వ‌చ్చింది. చిన్న చిన్న యాడ్ షూట్స్ అయినా స‌మ‌యం ఎక్కువ‌గానే ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో షూట్ కూడా వెంట‌నే పూర్త‌వ్వ‌డం లేదుట‌. ఇలా బ‌న్నీ బిజీగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో కుటుంబాన్నీ మిస్ అవుతున్నారు. అయితే తాజాగా బ‌న్నీ -కుమార్తె అర్హ‌తో ఆడుకుంటోన్న ఓ ఫోటోని  స్నేహ  ఇన్ స్టాలో షేర్ చేసారు.

దీంతో బ‌న్నీ కి కాస్త విరామం దొరికిన‌ట్లు క‌నిపిస్తుంది. విశ్రాంతి దొరికితే బ‌న్నీ ఇంటికి అతుక్కుపోతాడు. స‌మయాన్ని కుటుంబానికే కేటాయిస్తాడు. అందులోనూ కుమార్తె  అర్హ అంటే  పంచ ప్రాణాలు. పాప‌తో ఆడుకోవ‌డానికి ఎంతో ఆస‌క్తి చూపిస్తారు. ఇంట్లో ఉంటే  అర్హ‌నే బ‌న్నీకి టైంపాస్. ప్ర‌స్తుతం బ‌న్నీ అదే ప‌నిలో ఉన్న‌ట్లు తెలుస్తుంది.

అర్హ‌తో ప్ర‌తీ మూవ్ మెంట్ ని అభిమానుల‌తో పంచుకుంటారు. ఇప్ప‌టికే అర్హ‌తో క‌లిసి ఉన్న కొన్ని వీడియోలు..ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారిన సంగ‌తి తెలిసిందే. తాజాగా లీక్ అయిన ఫోటో అభిమానుల్ని ఆక‌ట్టుకుంటుంది. తండ్రీ-కుమార్తెల ముచ్చ‌ట చూసి అభిమానులు మురిసిపోతున్నారు. బ‌న్నీకి చెందిన సోష‌ల్ మీడియా ఖాతాల వ్య‌వ‌హారం మొత్తం భార్య‌ స్నేహా చూసుకుంటారు.

బ‌న్నీ అప్ డేట్స్ అన్నీ ఆమె స్వ‌యంగా అందిస్తారు. ఆమెకి సోష‌ల్ మీడియాలో మంచి పాలోయింగ్ ఉంది. ఇన్ స్టా ఖాతాలో మిలియ‌న్ ఫాలోవ‌ర్స్  ఉన్నారు. సెల‌బ్రిటీ క‌పుల్స్ లోనే  స్నేహ రికార్డునే సృష్టించారు. ఇవ‌న్నీ బ‌న్నీకి భార్యామ‌ణి కావ‌డం వ‌ల్లే సాధ్య‌మైంది. ఇక  బన్నీ యాడ్ షూట్స్ పూర్తిచేసిన అనంత‌రం `పుష్ప‌-2` షూటింగ్ లో బిజీ అవుతారు. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ కి సుకుమార్ తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. 
Tags:    

Similar News