హీరోలు మేకోవర్ చేయడం ఇప్పుడు సినిమాల్లో కామన్ అయిపోయింది. స్టార్ హీరోలు అయితే.. ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా రిలీజ్ దగ్గర పడేవరకూ.. కొన్ని సార్లు సినిమా రిలీజ్ అయ్యే వరకూ తమ మేకోవర్ ను చూపించేందుకు ఇష్టపడ్డం లేదు. ఇప్పుడు బన్నీ కూడా ఇదే రూట్ లో ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది.
డీజే మూవీలో బన్నీ బ్రాహ్మిన్ లుక్ ని ఇప్పటికే టీజర్ లో రివీల్ చేసేశారు. అయితే.. ఈ సినిమాలో మరో లుక్ కూడా ఉంటుందనే టాక్ ఉంది. దాన్ని ఇంకా బయటపెట్టలేదు. తాజాగా అల్లు రామలింగయ్య అవార్డ్ ఈవెంట్ కు హాజరైన అల్లు అర్జున్.. ఆ ఫంక్షన్ కు మొహానికి మాస్క్ తో వచ్చాడు. తన తాతయ్య స్మృతిగా జరిగే ఈ వేడుకకు ఏటేటా హాజరవుతాడు బన్నీ. అలాగే మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా రావడంతో.. దుబాయ్ లో డీజే షూటింగ్ ను పూర్తి చేసుకుని మరీ వచ్చేశాడు. కానీ మాస్క్ తో కనిపించడంతో.. లుక్ దాచి పెట్టేందుకే అనే టాక్ వినిపిస్తోంది.
నిజానికి అబుదాబి వెదర్ కారణంగా.. బన్నీకి విపరీతమైన జలుబు.. దగ్గు పట్టుకున్నాయట. దీనికోసం మెడిసిన్స్ వాడుతున్న బన్నీ.. ఎలర్జీ రాకుండా ఉండేందుకే ఇలా మాస్క్ తో వచ్చాడని తెలుస్తోంది. ఏమైనా ఈ మాస్క్ మాత్రం రెండు రకాలుగానూ ఉపయోగపడిందనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/