అల్లు అర్జున్ ను ఫ్యాన్స్ ముద్దుగా స్టైలిష్ స్టార్ అని పిలుచుకుంటారు. ఇలా ఎందుకు తాను స్టైలిష్ స్టార్ అయ్యాడనే విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూనే ఉంటాడు బన్నీ. ప్రతీ సినిమాకు హెయిర్ స్టైల్ నుంచి మొత్తం స్టైలింగ్ మార్చేస్తుంటాడు.
ఇప్పుడు ఫస్ట్ ఇంపాక్ట్ అంటూ తన కొత్త సినిమా నా పేరు సూర్యకు టీజర్ ఇచ్చేశాడు అల్లు అర్జున్. యాంగ్రీ మిలటరీ మ్యాన్ పాత్రలో అదరగొట్టేశాడని చెప్పాలి. దేశం కోసం చచ్చిపోవడానికి అయినా రెడీ కానీ.. బోర్డర్ కి వెళ్లి అక్కడ చచ్చిపోతా అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ సూపర్ అనాల్సిందే. ఈ టీజర్ లో చాలానే హైలైట్స్ ఉన్నాయి. అయితే.. అల్లు అర్జున్ స్టైలింగ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. మిలటరీ పాత్రకు స్టైలింగ్ అంటే కష్టమైన విషయమే. కానీ అల్లు అర్జున్ మాత్రం హెయిర్ స్టైల్ తో తెగ ఆకట్టుకుంటున్నాడు. మిలిటరీ క్రాఫ్ అయినా సరే.. సైడ్స్ పూర్తిగా హెయిర్ తీసేయడం.. పాపిడి దగ్గర పెద్ద గాటు మాదిరిగా కనిపిస్తున్న లుక్ మరీ క్రేజీగా ఉంది.
ఎప్పటికప్పుడు కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ చూపించడంలో బన్నీ దిట్ట. స్టైలిష్ స్టార్ హెయిర్ స్టైల్ చూసి.. అదే సినిమానో చెప్పేయచ్చంటే ఆశ్చర్యమేమీ లేదు. ఇప్పుడు నా పేరు సూర్య మూవీలో కూడా కొత్తగా కనిపిస్తున్నాడు ఈ స్టార్. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అనుకున్నట్లుగా సినిమా సాధిస్తే మాత్రం.. ఈ హెయిర్ స్టైల్ కూడా ట్రెండింగ్ అయిపోవడం.. జనాలు ఫాలో అయిపోవడం ఖాయం అనుకోవచ్చు.