గతంలో అయితే సినిమా షూటింగులు జరుగుతుంటే అభిమానులు పెద్ద ఎత్తున పోగయ్యేవాళ్లు. తమ అభిమాన హీరో హీరోయిన్ల విన్యాసాలు నేరుగా చూసి మురిసిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుండటంతో చూసిందంతా రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో షేర్ చేసేస్తున్నారు. అందుకే ఔట్ డోర్ షూటింగులంటేనే భయపడిపోతున్నారు ఫిలిం మేకర్స్. అభిమానుల ఉత్సాహానికి బ్రేక్ వేస్తూ.. షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి చాలా దూరం నుంచే వాళ్లను ఆపేస్తున్నారు. ఐతే అల్లు అర్జున్ కొత్త సినిమా ‘నా పేరు సూర్య’ షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలోకి మాత్రం అభిమానుల్ని అనుమతిస్తున్నారట. ఐతే ఆ చిత్ర షూటింగ్ జరుగుతున్నది లోకల్ గా కాదు.. ఊటీలో.
బన్నీ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా ఊటీలో జరుగుతోంది. హీరో బన్నీ.. హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ తో పాటు పోసాని కృష్ణమురళి కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. ప్రతి రోజూ అభిమానులు పెద్ద ఎత్తున షూటింగ్ చూసేందుకు వస్తున్నారట. ఐతే వాళ్లను నిరాశకు గురి చేయకుండా ఫొటోలు.. వీడియోలు తీయొద్దని చెబుతూ షూటింగుకి అనుమతిస్తున్నారట. అంతే కాదు.. వారికి భోజన ఏర్పాట్లు కూడా చేయించాడట అల్లు అర్జున్. దీని గురించి సోషల్ మీడియాలో అభిమానులు బన్నీ ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటున్నారు. బన్నీకి కేరళతో పాటు తమిళనాడులోనూ అభిమాన గణం బాగానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఊటీలో షూటింగ్ కు కూడా అభిమానులు పెద్ద ఎత్తున వస్తున్నట్లు సమాచారం.