సభాముఖంగా సమంతకి ధన్యవాదాలు

Update: 2021-12-13 04:18 GMT
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన 'పుష్ప' సినిమా, ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా సుకుమార్ ఈ సినిమాకి అనేక ప్రత్యేకతలను .. విశేషాలను యాడ్ చేసుకుంటూ వస్తున్నాడు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒకదానికి మించిన సాంగ్ మరొకటి అన్నట్టుగా వదులుతూ వచ్చాడు. ఈ సినిమా కథా నేపథ్యమే మాస్ ఏరియాలో సాగేది కావడంతో, ఆయన మాస్ ట్యూన్స్ ను అదరగొట్టేస్తూ వచ్చాడు.

చివరి నిమిషంలో కూడా సుకుమార్ ఈ సినిమాకి మరో అదనపు ఆకర్షణ తీసుకుని వచ్చాడు. వేరే ఆర్టిస్టుతో చేయవలసిన ఐటమ్ సాంగ్ కోసం ఏకంగా సమంతను రంగంలోకి దింపాడు. అంతకుముందు తనకి 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కారణంగా సమంత వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పెద్దగా గ్యాప్ లేకుండానే ఆ సాంగ్ ను చిత్రీకరించడం .. లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయడం కూడా జరిగిపోయింది. గతంలో సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ఐటమ్ సాంగ్స్ మాదిరిగనే ఈ పాట కూడా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.

ఈ నెల 17వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా, రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఈ సినిమా కోసం అంకితభావంతో పని చేసిన సాంకేతిక నిపుణులను ప్రశంసించాడు. ఆర్టిస్టులందరినీ అభినందించాడు. ఆ సమయంలోనే ఆయన సమంతను గురించి ప్రస్తావించాడు. "ముఖ్యంగా నేను సమంతగారికి థ్యాంక్యూ చెప్పాలి. ఎందుకంటే స్టార్ హీరోయిన్స్ కి ఇలాంటి స్పెషల్ సాంగ్స్ చేసేటప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి. ఇలా అయితే చేస్తాను .. అలా అయితే చేయను అని చెప్పేసి అంటూ ఉంటారు.

కానీ సమంతగారు మాత్రం ఆమె నమ్మినా నమ్మకపోయినా, మేము ఏది అడిగితే అది వచ్చి .. చేసి వెళ్లారు. అందుకు సభాముఖంగా సమంత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను .. థ్యాంక్యూ సమంత గారు. ఈ సాంగ్ కూడా తగ్గేదే లే అన్నట్టుగా ఉంటుంది .. మీరు చూడండి అంతే. ఇక ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి పాత్ర పేరు ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది. సునీల్ .. రావు రమేశ్ .. అనసూయ .. అజయ్ ఘోష్ తమ పాత్రలను అద్భుతంగా చేశారు. ఏ రకంగా చూసినా ఈ సినిమా ఎలా అయితే ఉండాలని మీరంతా అనుకుంటున్నారో .. అలాగే ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News