మన హీరో చేసేది ఎంత ఊర మాస్ రోల్ అయినా ఫేస్ ఫుల్ మేకప్ తో నిగనగలాడాల్సిందే. అయితే ఇది ఒకప్పటి ఫార్ములా. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎంత స్టార్ హీరో అయినా క్యారెక్టర్ లోకి నేచురల్ లుక్ తో ఒదిగిపోవాలన్నది లేటెస్ట్ ట్రెండ్. అలా లేదంటే ఆడియన్స్ చేసే ట్రోల్స్ కి బలైపోవాల్సి వస్తోంది. ఈ రోజుల్లో స్టార్ హీరోలు సైతం కథ- పాత్ర అవసరం మేరకు ఈ విషయంలో చాలా జాగ్రత్తపడుతున్నారు. క్యారెక్టర్ డిమాండ్ మేరకే సినిమాలో అలానే కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. దాంతో ఆడియన్స్ నుంచి ఫిర్యాదులు తగ్గుతున్నాయి. ఈ ఫార్ములాని ఫాలో చేయడంలో తమిళ తంబీల తర్వాతనే. భారతీరాజా- భాగ్యరాజా టైమ్ నుంచి ఇప్పటికీ నేటివిటీ నేచురాలిటీలో తంబీలు పెట్టింది పేరు. ఆ రోజుల్లోనే రజనీకాంత్- కమల్ హాసన్- చంద్రమోహన్ లాంటి స్టార్లు నేచురల్ గా కనిపించి అభిమానులకు పిచ్చిగా నచ్చేశారు. ఇక ఇటీవల బాలీవుడ్ హీరోలు దీనినే ఫాలో అవుతున్నారు. రణవీర్- హృతిక్ లాంటి హీరోలు కొత్త తరహా మేకప్ లతో ప్రయోగాలు చేస్తున్నారు.
బాలీవుడ్ లో ఈ మధ్య వచ్చిన `సూపర్ 30` చిత్రంలో హృతిక్ రోషన్ డీ గ్లామర్ క్యారెక్టర్ లో మడ్డి పట్టి నల్లగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ తిన్నారు. ఇది బాలీవుడ్ లో స్పష్టమైన మార్పునకు సంకేతం అనే చెప్పాలి. `గల్లీబాయ్`లో రణ్ వీర్ సింగ్ పక్కింటి అబ్బాయిలా నేచురల్ గా కనిపించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిందంటే రణవీర్ మేకోవర్ ఓ కారణం. ఇదే ఫార్ములాని తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫాలో అవుతున్నాడు. తాజా చిత్రం `అల వైకుంఠపురములో` చిత్రంలో మధ్య తరగతి యువకుడిగా మాస్ పాత్రలో నటిస్తున్న అల్లు అర్జున్ క్యారెక్టర్ ఆడియన్ కి బాగా చేరువ చేయాలని కాస్త మడ్డి పట్టిన డార్క్ మేకప్ ని ఉపయోగించారని అర్థమవుతోంది.
ఇటీవల రిలీజ్ చేసిన అల వైకుంఠపురములో టీజర్ లో అల్లు అర్జున్ ముఖంపై మడ్డి పట్టినట్టుగా.. ఆయిలీ లుక్ తో డార్క్ మేకప్ కనిపించింది. తన సహజ మేనిఛాయకు అనుగుణంగానే.. నేచురల్ గా డార్క్ గా అల్లు అర్జున్ ముఖం కనిపించడం ఆకట్టుకుంటోంది. ఇలా ఓ తెలుగు స్టార్ హీరో డార్క్ మేకప్ తో నటించడం టాలీవుడ్ సినీ చరిత్రలో ఇదే మొదటిసారి. కాయ కష్టం చేసుకునే పల్లెటూరి కుర్రాడికి చెమట పట్టడం అది మడ్డిగా మారడం సహజం. అలాంటి కుర్రాడిని అల్ట్రా మోడ్రన్ లుక్ లో చూపించేసినా సహజ గుణాల్ని ఆపాదించాల్సి ఉంటుందన్న ఫార్ములాని ఫాలో చేస్తున్నట్టే అనిపిస్తోంది. అందుకే బన్ని ఆయిలీ డార్క్ లుక్ అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది.
ఇటీవల రిలీజ్ చేసిన అల.. టీజర్ 20 గంటల్లోనే 6 మిలియన్ల వ్యూస్ అధిగమించడం చూస్తే సినిమా పై ఆడియన్ లో వున్న ఆసక్తిని తెలియజేస్తోంది. ఇప్పటికే థమన్ ఆడియోతో అల హైప్ పెరిగింది. సంక్రాంతి రేసులో అందరికంటే ప్రచారంలో వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే.