100 కోట్లు కోరుకుంటే 300 కోట్లు దక్కాయి : బన్నీ

Update: 2021-09-25 13:30 GMT
అల్లు అర్జున్‌ నటించి గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాకు సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు లభించాయి. మోస్ట్‌ పాపులర్ యాక్టర్ గా అల్లు అర్జున్ కు.. మోస్ట్‌ పాపులర్ యాక్టరస్ గా పూజా హెగ్డేకు.. మోస్ట్‌ పాపులర్ డైరెక్టర్ గా త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కు.. మోస్ట్ పాపులర్ మూవీగా అల్లు అరవింద్‌.. మోస్ట్‌ పాపులర్ సంగీత దర్శకుడిగా థమన్ కు సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు లభించాయి. ఈ సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ నాకు అవార్డులు అంటే చాలా ఇష్టం. అల వైకుంఠపురంలో సినిమాకు నాకు అవార్డు వస్తుందని నేను ఊహించలేదు. మా డైరెక్టర్ త్రివిక్రమ్‌ గారి వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది. ఇక బ్రదర్ థమన్ నాకు వన్ బిలియన్‌ (100 కోట్లు) ప్లే అవుట్స్ ఇస్తానంటూ హామీ ఇచ్చాడు. నేను వంద కోట్ల ప్లే అవుట్స్ ను కోరుకుంటే థమన్‌ నాకు ఏకంగా మూడు వందల కోట్ల ప్లే అవుట్స్ ఇచ్చాడని బన్నీ పేర్కొన్నాడు. 2020 లాస్ట్‌ లో ఎవడు సిక్స్ కొడతాడో ఆడే మొత్తం డికేడ్ అంతా కొట్టినట్లు. ఆల్బమ్ ఆఫ్ ది డికేడ్ అల వైకుంఠపురంలో. థ్యాంక్యూ థమన్‌.. ఈ సినిమాలోని పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రీ.. కాసర్ల శ్యామ్‌ మరియు సిరివెన్నెల గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు.

చిన్న పిల్లలకు చాక్లెట్లు ఎంతగా ఇష్టం ఉంటుందో సినిమా వారికి అవార్డులు కూడా అంతే ఇష్టం. చిన్న పిల్లలు ఎలా అయితే చాక్లెట్లు ఎన్ని ఇచ్చినా వద్దు అనరో అలాగే మేము కూడా ఎన్ని అవార్డులు వచ్చినా కూడా కొత్త అవార్డు కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. అవార్డు వచ్చిన ప్రతి సారి మురిసి పోతాం అంటూ త్రివిక్రమ్‌ అన్నారు. అల వైకుంఠపురంలో సినిమాకు సంబంధించిన అవార్డుల్లో మొదటి అవార్డుగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డు నిలుస్తుంది. ముందు ముందు ఈ సినిమాకు మరిన్ని అవార్డులు వస్తాయి అనేది ఆయన అభిప్రాయం. ఈ సినిమా ను నిర్మించిన నిర్మాతలకు మరియు సినిమా విడుదల కాకుండానే జనాల్లోకి తీసుకు వెళ్లి హిట్‌ చేసిన థమన్ కు కృతజ్ఞతలు. సినిమా లో నటించిన ప్రతి ఒక్కరికి మరియు టెక్నీషియన్స్ అందరికి ఇంకా అల్లు అర్జున్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ త్రివిక్రమ్‌ తన సంతోషాన్ని పంచుకున్నారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 2020 లో అల వైకుంఠపురంలో సినిమా సక్సెస్ సెలబ్రేషన్ చేసిన సమయంలో అంత మంది జనాలను చూశాను. మళ్లీ అంతమంది జనాలను ఈ ఏడాదిన్నర కాలంలో చూడలేదు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఇంత మందిని చూడటం జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చాడు. ఏడాదిన్నర కాలం తర్వాత ఇండస్ట్రీలో జరుగుతున్న అతి పెద్ద మొదటి వేడుక ఇదే అంటూ అవార్డు వేడుకను గురించి అల్లు అరవింద్‌ చెప్పుకొచ్చాడు. థర్డ్‌ వేవ్‌ లేదని ముందుకు సాగాలని.. ఇండస్ట్రీ మళ్లీ మునుపటి లా కళకళలాడుతూ ఉండాలని ఆశిస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. థమన్ మాట్లాడుతూ ఈ సినిమాకు అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్‌ మొత్తం త్రివిక్రమ్ గారిదే. ఇంత పెద్ద స్థాయిలో ఈ సినిమా రావడానికి మాత్రం నిర్మాతలు ఇద్దరు కారణం అన్నారు. ఈ సినిమా కు మంచి సాహిత్యం అందించిన రచయితలకు కృతజ్ఞతలు. అవార్డు ఇచ్చిన సాక్షి వారికి కూడా కృతజ్ఞతలు అన్నాడు.




Tags:    

Similar News