పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన `భీమ్లా నాయక్` బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. `అత్తారింటికి దారేది` తర్వాత ఆ స్థాయి పాజిటివ్ బజ్ `భీమ్లా నాయక్` కి వస్తోంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వచ్చిన జెన్యూన్ సక్సెస్ ఇది. దీంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవ్. మాస్ ఆడియన్స్ లో నాయక్ ఫీవర్ కొనసాగుతోంది. ఇప్పటికే 90 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. దీంతో అంతా హ్యాపీ.
కానీ పరిశ్రమ నుంచి మాత్రం సినిమా గురించి ఉద్దేశించి పెద్దగా మాట్లాడింది లేదు. సూపర్ స్టార్ మహేష్ మాత్రం పాజిటివ్ గా ఓ ట్వీట్ చేసి అభింనందించారు. ఇక మెగా ఫ్యామిలీ హీరోలెవరు ఈ సినిమా గురించి ఇప్పటి వరకూ స్పందించింది లేదు. మరి ఈ మౌనం వెనుక కారణాల సంగతి పక్కనబెడితే.. తాజాగా ఈసినిమా ని అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి ఏఎంబీ మాల్ లో వీక్షించారు.
భార్య స్నేహారెడ్డి..పిల్లలు ఆయాన్- అర్హ తో పాటు కొంత మంది స్నేహితులు..కజిన్స్ ఇలా కొంత మంది శుక్రవారం సాయంత్రం ఏఎంబీ మాల్ లో సినిమా చూసొచ్చారు. `భీమ్లా నాయక్` ఆద్యంతం అందర్నీ ఆకట్టుకుంది. బన్నీ ఇలా సినిమా చూడటం వరకూ బాగానే ఉంది. ఇప్పుడా సినిమాని ఉద్దేశించి ట్విటర్లో ఏదైనా కామెంట్ పెడతారా? రివ్యూ ఏదైనా ఇస్తారా? అని ప్రేక్షకాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
మరి బన్నీ రిప్లై ఇస్తారా? లేక! మౌనంగా ఉంటారా? అన్నది మరికొన్ని గంటలు ఆగితే గానీ తెలియదు. ఇక బన్నీ నటించిన `పుష్ప` సినిమాపై మెగా ఫ్యామిలీ ఎవరూ స్పందించని సంగతి తెలిసిందే. `పుష్ప` తో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. టాలీవుడ్ సహా బాలీవుడ్ ప్రముఖులు సినిమాని ఉద్దేశించి తమ అభిప్రాయాలు తెలిపారు. కానీ మెగా ఫ్యామిలీ మాత్రం లైట్ తీసుకున్నట్లే కనిపించింది. ఈనేపథ్యంలో బన్నీ పూర్తి కాంట్రాస్ట్ గా `భీమ్లానాయక్` సినిమా చూడటమే ఆసక్తికరంగా మారింది. దీంతో బన్నీ తన అభిప్రాయాన్నిచెబుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బన్నీ మనసులో ఏముందో.
ఒకప్పుడు బన్నీ- పవన్ అభిమానుల మధ్య తీవ్రమైన వైరం ఉండేది. సోషల్ మీడియా వేదికగా ఒకర్ని ఒకరు దూషించుకున్న సందర్భాలున్నాయి. ఆ తర్వాత కాలక్రమేణా ఆ వివాదాలు చల్లారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మెగా ఫ్యామిలీ అభిమానుల మధ్య సఖ్యత మరింత అవసరం. పరిశ్రమలో కొన్ని పరిస్థితులకు మెగా ఫ్యామిలీకి-పవన్ కి వ్యతిరేకంగా ఉన్నట్లు మీడియా కథనాలు హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే.