`02 అక్టోబర్` గాంధీ జయంతి.. ఇదే రోజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినం. ఆసక్తికరంగా ఈరోజు పవన్ కి సినీరాజకీయ ప్రముఖుల నుంచి ఎన్నారై ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ సహా మెగా కుటుంబ హీరోలంతా ఇప్పటికే పవన్ కి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు యంగ్ హీరోలు నేరుగా పవన్ ని కలిసి విష్ చేశారు.
తాజాగా పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెప్పడం యూత్ లో చర్చకు వచ్చింది. ఆగస్టు 22 న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో చిరంజీవి నివాసంలో ఆయన లేకపోవడంపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. కొందరు రకరకాల వైరుధ్యాలు అంటూ కథనాలు రాసారు. అయితే బన్ని ఎప్పుడూ తన మావయ్య చిరంజీవి గారి నుంచే స్ఫూర్తి పొంది తామంతా ఈ రోజు ఈ స్థాయికి ఎదిగామని వినయవిధేయతలతో వేదికలపై వెల్లడిస్తుంటారన్న సంగతి తెలిసిందే. కానీ కొందరు డివైడ్ పాలిటిక్స్ ని ఎత్తి చూపడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతూనే ఉంది.
ఇకపోతే అల్లు అర్జున్ కి సపరేట్ గా ఫ్యాన్ బేస్ ఉందన్నది నిజం. స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ సపరేట్ గా అభివృద్ధి చెందడం వెనక అతడి టీమ్ కృషి దాగి ఉంది. ఇకపోతే మావయ్యలు చిరంజీవి.. పవన్ కల్యాణ్ ల బర్త్ డేలకు బన్ని విషెస్ తెలిపారు. నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు బన్ని. ఈ ఉదయం వేకువ అవర్స్ లోనే పవన్ కి శుభాకాంక్షలు తెలిపాడు. శుభాకాంక్షలతో పాటు.. కుటుంబ వేడుకలో ఆప్యాయంగా కౌగిలించుకున్న ప్రైవేట్ ఫోటోను కూడా పంచుకున్నాడు. ఇది పవన్ కల్యాణ్ .. బన్ని ఇరువురి అభిమానుల్లోనూ వైరల్ గా మారింది. నిజానికి పవన్ మావయ్యపై బన్ని ప్రేమకు చిహ్నమిది!అంటూ పొగిడేసిన అభిమానులు లేకపోలేదు.
చరణ్ వర్సెస్ బన్ని పోటీ ఎప్పుడూ ఉన్నదే!
నిజానికి మెగా ఫ్యామిలీ హీరోల్లో అంతర్గత పోటీ ఎప్పుడూ ఉన్నదే. ఒకరిని మించి ఒకరు పోటీపడుతూ నటించాలని రికార్డులు బ్రేక్ చేయాలని కలలుగనడం పోటీతత్వం చూసేదే. అయితే ఇది ఆరోగ్యకరంగా ఉండాలనేది వారి ఆలోచన. రంగస్థలం చిత్రంతో రామ్ చరణ్ ఇండస్ట్రీ రికార్డుల్ని బ్రేక్ చేయగా... ఆ తర్వాత అల వైకుంఠపురములో చిత్రంతో బన్ని సరికొత్త రికార్డుల్ని అందుకున్నాడు. ఇప్పుడు కూడా ఆ ఇద్దరి మధ్యా పోటీ నడుస్తోంది. బన్ని తదుపరి పుష్ప చిత్రంతో మరోసారి రికార్డుల్ని బ్రేక్ చేయాలని కొత్త రికార్డులు సెట్ చేయాలని తపిస్తున్నాడు. ఆ ఇద్దరి పోటీ ఎప్పుడూ వెటరన్ అయిన చిరుతో ముడిపడి ఉండనిది.
ఇంతకుముందు రంగస్థలం చిత్రంలో సిట్టిబాబుగా చరణ్ ఆహార్యం పై క్రిటిక్స్ సహా ప్రేక్షకాభిమానుల ప్రశంసలు కురిసాయి. చెవిటివాడిగా నిక్కరుపై పంచెకట్టే మాస్ గోదారి కుర్రాడిగా చరణ్ నటనకు జేజేలు పలికారు. ఇప్పుడు అంతకుమించి సవాల్ ని బన్ని స్వీకరించాడు. అదే పుష్పరాజ్ పాత్ర. అడవిలో గంధపు చెక్కలను దొంగిలించే స్మగ్లర్ గా తన శరీరానికి గాయమైతే లోపంతోనే మెరిపించేవాడిగా.. గాయపడిన స్మగ్లర్ ఆహార్యాన్ని ట్రై చేస్తున్నాడు. పుష్ప టీజర్ లో ఒక చెయ్యి కదల్చలేని ఒకవైపు కాస్త వొంగి నడిచేవాడిగా కనిపించి షాకిచ్చాడు. పొడవాటి గిరజాల జుట్టు పక్కపాపిడితో గుబురుగడ్డం మీసకట్టుతో బన్ని ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. స్తంభింపచేసిన భుజాన్ని కదపడమెలా.. అన్నది దాక్కో దాక్కో మేకా పాట ప్రోమోలో ఆ కష్టం కనిపించింది బన్నీలో. అచ్చంగా గంధపు చెక్కల స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలోకి ఒదిగిపోయేందుకు అల్లు అర్జున్ ఎంతగానో శ్రమిస్తున్నారు.
దేనికైనా ప్రాణం పెట్టి పని చేయాలి. అందుకు బన్ని ఏమాత్రం వెనకాడడు అని... ఇప్పుడు బన్ని ఆహార్యం మరోసారి రంగస్థలం చిట్టిబాబులా హాట్ టాపిక్ గా మారడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఇక బన్నిపై పై చేయి సాధించే దిశగా చరణ్ ఎత్తుగడలు తెలిసినవే. చరణ్ తదుపరి ఆర్.ఆర్.ఆర్ తో సంచలనాలకు రెడీ అయ్యాడు. ఆ తర్వాతా సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఆర్సీ 15కి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇదంతా మెగా హీరోల నడుమ కాంపిటీషన్ ని చూపిస్తోంది.