ఆదివారం రాత్రి జరిగిన 'టాక్సీవాలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. టాక్సీవాలా నుండి #మీటూ వరకూ తన స్పీచ్ లో దాదాపు అన్నీ అంశాలపై మాట్లాడాడు. తన సినిమా గురించి మాత్రం 'ఆ ఒక్కటి అడగొద్దు' అన్నాడు. ఆడిటోరియంలో సినిమా గురించి చెప్పాలని గోల చేస్తూ ఉంటే 'తెలీదు బ్రదర్' అని నవ్వుతూ అన్నాడు.
ఇక రీసెంట్ గా లాంచ్ అయిన రాజమౌళి చిత్రం #RRR గురించి కూడా మాట్లాడాడు. "మై మోస్ట్ ఫేవరెట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు.. బావ తారక్ (నేను సరదాగా బావ అని పిలుస్తా) తెలుగు ప్రైడ్ రాజమౌళి గారికి #RRR లాంచ్ సందర్భంగా అల్ ది బెస్ట్" అన్నాడు. అల్లు అర్జున్ ఇలా మాట్లాడినప్పుడు ఆడిటోరియం హోరెత్తిపోయింది. హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గురించి మాట్లాడుతూ "ప్రియాంక మహారాష్ట్ర అమ్మాయి అని.. అనంతపుర్ లో పెరిగిందని తెలిసింది.. తెలుగును ఇష్టపడేవాళ్ళు ఎవ్వరైనా తెలుగు వ్యక్తి అయిపోతారు. ఇందాక నువ్వు మాట్లాడుతూ నామీద క్రష్ ఉందన్నావు. ఇప్పుడు చెప్పి ఏం ఉపయోగం(నవ్వుతూ).." అన్నాడు. ఇండైరెక్ట్ గా నాకు పెళ్ళి అయి పిల్లలు ఉన్నారు.. లేట్ అయిందని హింట్ ఇచ్చాడు!
ఇక #మీటూ గురించి మాట్లాడుతూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అమ్మాయిలను.. హీరోయిన్లను చాలా గౌరవిస్తుందని.. మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే ఇక్కడే అమ్మాయిలకు గౌరవం ఎక్కువని అన్నాడు. అందుకే ఇతర భాషలకు చిందిన హీరోయిన్లు తెలుగులో పని చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని.. అమ్మాయిలు నిర్భయంగా ఇండస్ట్రీకి రావచ్చని అన్నాడు..