గీతా ఆర్ట్స్ బెట్టింగ్‌ నిజమే అంటారా?

Update: 2016-06-07 17:30 GMT
ఇప్పుడు అందరి కళ్ళూ గీతా ఆర్ట్స్ వైపే చూస్తున్నాయి. మనోళ్ళు మరో ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్టుపై బెట్టింగ్‌ కట్టారు. అబ్బే బెట్టింగ్‌ అంటే.. ఇంకేదో అనుకునేరు.. అదేనండీ.. ఇన్వెస్టుమెంట్‌ పెట్టారు. అయితే ఇందులోఎంతవరకు నిజం ఉందో తెలియదు కాని.. కొన్ని రూమర్లను వింటుంటే నిజమే అనిపిస్తోంది.

అప్పటలో రజనీకాంత్‌ ''రోబో'' సినిమా బాగా వచ్చిందనే అనే టాక్‌ ముందే రావడంతో.. వెంటనే సినిమాను భారీ రేటుకు అమ్మాలని నిర్మాతలు డిసైడ్‌ అయ్యారు. దానితో ఈస్ట్ గోదావరికి చెందిన ఒక మిరపకాయల వ్యాపారి భారీ పైకం వెచ్చించి సినిమాను కొన్నాడు. ఇప్పుడు ''కబాలి'' పరిస్థితి కూడా అంతే. అసలు ఫీల్డులోనే పెద్దగా పరిచయంలేని పంపిణీదారుడు ఒకరు కాస్త బాగా ముట్టజెప్పి కొనేశారు. అయితే ఈ రెండుసార్లూ కూడా.. అసలు సినిమాను కొనుకున్నారు అనుకుంటున్నవారు కేవలం బినామీలే తప్పించి.. వారు అంత డబ్బు పెట్టి సినిమాలు కొనలేదు అనేది ఒక రూమర్. ఎందుకంటే ఈ రజనీ సినిమాలను కొన్నాక సదరు డిస్ర్టిబ్యూటర్లు మళ్ళీ ఎప్పుడూ ఎక్కడా ఏ సినిమాను కొన్నట్లు కాని.. లేదా ప్రొడ్యూస్ చేసినట్లు కాని కనిపించలేదు.

ఇకపోతే అప్పట్లో రోబో సినిమా గురించి న్యూస్ వచ్చినప్పుడు కూడా దానికి సీక్రెట్‌ ఇన్వెస్టర్‌ అల్లు అరవింద్ అనే టాక్‌ వచ్చింది. ఇప్పుడు కూడా అంతే.. 30 కోట్ల రూపాయలు పెట్టి ''కబాలి'' సినిమాను కొనుక్కుంది గీతా ఆర్ట్స్ వారే అనే టాక్‌ వస్తోంది. కాకపోతే సొంతంగా వారు సీన్లో ఉండకుండా.. ఇలా ఫ్రెంట్‌ అండ్‌ ఒక బినామీని పెడుతున్నారట. ఏమంటారు అల్లూ జి?

Tags:    

Similar News