విజయ్ దేవరకొండ నెక్ట్స్ పిక్చర్ పై అంతటా ఆసక్తి ఉంది. అర్జున్ రెడ్డి తర్వాత ఈ సెన్సేషనల్ హీరో కొత్త సినిమా రాలేదు. మధ్యలో వచ్చిన మూవీ తన బ్యాక్ లాగ్ అని హీరోనే చెప్పాడు. అందుకే ఈ హీరో సక్సెస్ ఫీట్ ను కంటిన్యూ చేసే సినిమాగా ట్యాక్సీవాలా మూవీపై అంచనాలు పెట్టుకుంటే.. ఆ సినిమా అంతకంతకూ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది.
అల్లు అరవింద్ లాంటి ప్రొడ్యూసర్ సినిమా ఆలస్యం అవడం అంటే.. విచిత్రమైన విషయమే. కానీ ఇందుకు కారణం.. అల్లు వారి పెద్ద కొడుకే అని ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ వినిపిస్తోంది. రాహుల్ సాంక్రిత్యన్ దర్శకత్వంలో రూపొందిన ట్యాక్సీవాలా.. షూటింగ్ పార్ట్ ను ఎప్పుడో పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వీటిలో భాగంగా గ్రాఫిక్స్ వర్క్ కూడా ఎక్కువగానే ఉందట. దీన్ని అల్లు అరవింద్ పెద్ద కుమారుడు.. అల్లు బాబికి చెందిన ఓ గ్రాఫిక్ కంపెనీకి ఇచ్చారట. అనుకున్న సమయానికి ఔట్ పుట్ ఇవ్వడంలో ఈ కంపెనీ విఫలం అయిందని అంటున్నారు.
ఇప్పటికీ ఫైనల్ ఔట్ పుట్ ఇవ్వలేదట ఆ కంపెనీ. దీంతో గ్రాఫిక్ వర్క్ ను ఇతర కంపెనీలకు కూడా షేర్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొదటగా మే నెలలో అనుకున్న సినిమా.. ఆ తర్వాత జూన్ లో వస్తుందన్నారు. ఇప్పుడు జూలై వరకూ వెళ్లిపోయింది. ఆ సమయానికైనా కచ్చితంగా విడుదల చేయాలంటే.. ముందుగా ఆ గ్రాఫిక్ వర్క్ పూర్తి కావడం తప్పనిసరి.