టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ లో అడుగు పెట్టనున్నారా? అంటే అవుననే తాజా పరిణామం చెబుతోంది. పరిశ్రమలో కాంపిటీషన్ అంతకంతకు అగ్గి రాజేస్తోంది. సాటి హీరోల మధ్య పోటీ అంతే అనూహ్యంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఇండస్ట్రీ అరడజను అగ్ర హీరోలు ఇరుగు పొరుగు భాషలతో పాటు నార్త్ బెల్ట్ లోనూ ఫాలోయింగ్ సంపాదించాలని మార్కెట్ పెంచుకోవాలని తహతహలాడుతున్నారు.
ఉత్తరాదిన ప్రభాస్ కి ఇప్పటికే ఓ రేంజు ఉంది. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ తో రామ్ చరణ్ - రామారావు పేర్లు ఆ బెల్టులో మార్మోగుతున్నాయి. మహేష్ .. అల్లు అర్జున్ కూడా పోటీ బరిలో ఉన్నారు.
అయితే ఠఫ్ కాంపిటీషన్ ని ఎదుర్కొంటున్నా.. ఇతరుల కంటే జెట్ స్పీడ్ తో దూసుకెళ్లేలా అల్లు అర్జున్ తనదైన శైలి ప్లానింగ్ తో ముందుకెళుతున్నారని సమాచారం. ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం `పుష్ప`తోనే ఇది మొదలు. ఈ మూవీతోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఇటు నాలుగు ప్రధాన దక్షిణ భారత భాషలలో విడుదలవుతుంది. అలాగే హిందీ బెల్ట్ లోనూ భారీగా రిలీజ్ చేయాలన్న ప్లాన్ ఉంది.
ఇరు తెలుగు రాష్ట్రాలు సహా కేరళలో బన్నీకి భారీ ఫాలోయింగ్ ఉంది. తమిళనాడు .. కర్ణాటకలోనూ మంచి అభిమానులు ఉన్నారు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ కళ్ళు బాలీవుడ్ పై పడ్డాయి. అతను తన మొదటి ప్రయత్నంతోనే హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేయడానికి పెద్ద ఎత్తున ప్రణాళికలు వేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం... అల్లు అర్జున్ ఈ చిత్రం విడుదలకు ముందే ఉత్తరాదిన ప్రచారం పరంగా దూకుడు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారట. పుష్పకు బాలీవుడ్ లో విస్త్రత ప్రచారం తెచ్చేలా ప్రత్యేకించి ఒక పీఆర్ టీమ్ ని సిద్ధం చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే బన్ని నటించిన అనువాదాలు .. యూట్యూబ్ రిలీజ్ లు భారీ సక్సెసైన నేపథ్యంలో ఉత్తరాదిన పుష్ప సైమల్టేనియస్ & డైరెక్ట్ రిలీజ్ తో మరో మెట్టు ఎక్కుతాడనే అభిమానులు భావిస్తురు.