మొన్నటివరకు అస్సలు పెద్ద డైరక్టర్లను ఎట్రాక్ట్ చేయలేకపోయాడు యంగ్ హీరో అల్లు శిరీష్. మనోడు అస్సలు హిట్లు కొట్టలేకపోవడం.. యాక్టింగ్ పరంగా పెద్దగా ఇంప్రూవ్మెంట్ చూపించకపోవడంతో.. అసలు పెద్ద దర్శకులు ఎవ్వరూ శిరీష్ కోసం కథలు చెప్పలేదు. ఒక ప్రక్కన సాయిధరమ్ తేజ్ అండ్ వరుణ్ తేజ్ కోసం పెద్ద డైరక్టర్లు కథలు రాస్తున్నారు కాని.. శిరీష్ ను మాత్రం పట్టించుకోలేదు.
అయితే ఇప్పుడు సీన్ మారేలా ఉందంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. ''శ్రీరస్తు శుభమస్తు'' సినిమాలో అల్లు శిరీష్ యాక్టింగ్ తో ఇంప్రెస్ అయిన జనాలు.. మనోడ్ని సరైన స్టయిల్లో వాడుకుంటే మాత్రం రిజల్టు బాగుంటుంది అంటున్నారు. అంతే కాకుండా కొన్ని ఎమోషనల్ సీన్లలో శిరీష్ బాగానే నటించాడు. ఒక చోటైతే కన్నీళ్ళు తెప్పించాడు కూడా. అందుకే ఇప్పుడు పెద్ద దర్శకులు మనోడికి కథలు చెబుతారని.. ఇక శిరీష్ టార్గెట్ కాస్త పెద్ద సినిమాలేనని అంటున్నారు విశ్లేషకులు.
కాకపోతే ఇక్కడ మనం పట్టించుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే.. శిరీష్ బాగా చేస్తాడనే పాయింట్ బాగానే ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర కూడా బాగా లాక్కొస్తాడు అనే పాయింట్ చాలా ముఖ్యం. అప్పుడే ఇన్వెస్టుమెంట్లు పెరిగి కాస్త పెద్ద స్పాన్ ఉన్న కథలను చేయడానికి ఆస్కారం ఉంటుంది.