మూడో సినిమాతో అయినా.. శ్రీరస్తు శుభమస్తు రూపంలో అల్లు శిరీష్ మంచి హిట్ నే కొట్టాడు. తర్వాతి ప్రాజెక్టు విషయంలో కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న ఈ అల్లు హీరో.. సడెన్ గా మలయాళ మూవీకి అంగీకరించడమే కాదు.. అప్పుడే షూటింగ్ స్టార్ట్ చేసేశాడు కూడా.
మేజర్ రవి డైరెక్షన్ లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 1971:బెయాండ్ బోర్డర్స్ అనే మూవీకి సైన్ చేసిన అల్లు చేసిన శిరీష్.. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. రాజస్థాన్ లో అర్జున్ గడ్ ఆర్మీ బేస్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. టైటిల్ వినగానే దేశ భక్తి చిత్రం అని.. 1971లో ఇండియా పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధం ఆధారంగా తెరకెక్కుతోందనే సంగతి అర్ధమవుతూనే ఉంది. ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండి.. దేశభక్తి భావాలున్న కుర్రాడి కోసం దర్శకుడు వెతుకుతుంటే శిరీష్ ని ఓసారి కలవడం.. వెంటనే ప్రాజెక్టులోకి తీసుకోవడం జరిగిపోయాయి.
మలయాళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడంపై ఎక్సైటింగ్ గా ఉందని చెప్పిన శిరీష్.. మోహన్ లాల్ తో మొదటి సినిమాలో చేసే ఛాన్స్ రావడం మాత్రం మర్చిపోలేనని అన్నాడు. ఆయన అనుభవం నుంచి కొన్ని విషయాలనైనా ఈ చిత్రం షూటింగ్ పూర్తయిపోయేలోపు నేర్చుకుంటాడట. మలయాళ మూవీస్ రియలిస్టిక్ గా ఉంటాయని.. తెలుగు-తమిళ చిత్రాల్లో థియేట్రికల్ టైపు పెర్ఫామెన్స్ కనిపిస్తుందంటూ అల్లు శిరీష్ కామెంట్ చేయడం.. ఆశ్చర్యకరమే.