హీరో నిఖిల్ సరసన 'సూర్య వర్సెస్ సూర్య' చిత్రంలో నటించింది త్రిధా చౌదరి. చూడగానే క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. ప్రతిభ పరంగానూ ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ అమ్మడిని రెండో అవకాశం వరించింది. అదీ మెగా కాంపౌండ్‌లో అవకాశం. ప్రతిభ ఉంది అంటే అవకాశం ఇచ్చి ప్రోత్సహించడానికి అల్లు అరవింద్ ముందుంటారు. ఆ కోవలోనే రెజీనని మెగా కాంపౌండ్‌లో బందించేశారు. ఇప్పుడు మరో చిలమ్మ అక్కడ బందీ అయిపోతోంది. శిరీష్ సరసన పరశురామ్ చిత్రంలో నాయికగా నటిస్తోంది. ఈ చిత్రం కోసం అల్లూ వారబ్బాయి 6ప్యాక్ కూడా చేస్తున్నాడు. స్టన్నింగ్ లుక్‌తో పడేయాలన్నది ప్లాన్. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. త్రిధ మంచి నటి అని పేరు తెచ్చుకుంటే చాలు బన్ని నుంచి కూడా ప్రోత్సాహం దక్కుతుంది. అటుపై చరణ్, పవన్ ఇలా రేంజే మారిపోతుంది. గీతా ఆర్ట్స్, పవన్‌కల్యాణ్ ఆర్ట్స్ ఇలా అవకాశాలే అవకాశాలు. దేనికైనా రాసిపెట్టి ఉండాలంటారు. ఈ ప్రయత్నం విజయం దక్కితే చాలు. టాలీవుడ్లో క్షణం తీరిక లేనంత బిజీ అయిపోయే అవకాశం వుంటుంది. ఆల్ ది బెస్ట్ త్రిధ.