మన తెలుగు సినిమా అభిమాని చాలా గొప్పవాడు అనే అనాలి ఎందుకంటే మీరు ఒక కన్నడ అభిమానిని వెళ్ళి అడిగిన ఒక మలయాళం అభిమానిని వెళ్ళి అడిగిన ఒక్క హీరో పేరే చెబుతారు. ఇక్కడ తెలుగు అభిమానిని అడిగితే ఒక తెలుగు హీరోతో పాటుగా ఒక తమిళ్ హీరో పేరు కూడా చెబుతాడు. తమిళ్ సినిమా హీరోలు తమిళనాడు కు మాత్రమే చెందిన వారు కాదు ఎందుకంటే వాళ్ళ సినిమాలు మన దగ్గర కూడ విడుదల అవుతాయి. మన తెలుగులో కూడా తమిళ్ హీరోలకు అభిమానులు ఉన్నారు. వాళ్ళ సినిమాలు చూసిన మనమే వాళ్ళకి అభిమానులం అయినప్పుడు అక్కడే ఎక్కువగా పెరిగిన వాళ్ళకు తమిళ్ హీరోలు అంటే ఇష్టం ఉండటం పెద్ద విషయం కాదు కదా.
మన యంగ్ హీరోలలో నాగ చైతన్య - అల్లు అర్జున్ - మహేశ్ బాబు - రామ్ చరణ్ కానీ ఇలా కొంత మంది హీరో కొడుకులు ప్రొడ్యూసర్ కొడుకులు తమిళనాడులో పెరిగిన వారే. అలాగే మన అల్లూ వారి రెండో హీరో కూడా పూర్తిగా అక్కడే పెరగకపోయినా కొంత టచ్ ఉంది లెండి. అల్లు శిరీష్ కి తమిళ్ హీరో సూర్య అంటే చాల ఇష్టం అని చెప్పాడు చాలాసార్లు. ఇప్పుడు తన అభిమానం ఎంతో చెప్పడానికి ట్విటర్లో ఒక కొత్త పద్దతి ఎన్నుకున్నాడు. అది ఏంటంటే జూలై 23 నాడు సూర్య పుట్టినరోజు సందర్భంగా సూర్య ఫాన్స్ అందరూ సూర్య ఫోటో ని డిస్ ప్లే పిక్ గా పెట్టి సూర్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపండి అని పిలుపునిచ్చాడు. దాని కోసం #HBDసూర్యCDP అని హ్యాష్ టాగ్ కూడా మొదలుపెట్టాడు.
జూలై 23న సూర్య తన 42వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. ‘24’ సినిమా తో తెలుగులో మంచి విజయం సొంతం చేసుకున్నా సూర్య.. ఎందుకో ఈ మధ్య ఒక్క బ్లాక్ బస్టర్ కూడా కొట్టట్లేదు. ఇప్పుడు సెల్వరాగవన్ డైరక్షన్ లో ఒక సినిమా షూటింగ్ జరుపుకుంటున్నాడు. తన సొంత ప్రొడక్షన్ లో నిర్మించిన ‘మగలిర్ మత్తుమ్’ సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాలో సూర్య భార్య నటి జ్యోతిక ముఖ్యపాత్రలో నటిస్తోంది.