అన్నట్లుగానే కొడుకును వంటింట్లోకి తీసుకు వెళ్లిన అల్లు స్నేహా

Update: 2023-01-06 12:30 GMT
ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌  హీరో అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమా తర్వాత దేశ వ్యాప్తంగా విపరీతంగా బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ను దక్కించుకున్నాడు. ఇక సోషల్‌ మీడియా ద్వారా ఐకానిక్ స్టార్‌ భార్య అంటూ అల్లు స్నేహా రెడ్డి కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.

ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగా సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా కొత్త కొత్త పోస్ట్‌ లు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. కొన్ని సార్లు హీరోయిన్‌ కంటే అందంగా ఉన్నారు అంటూ కామెంట్స్ దక్కించుకునేలా అద్భుతమైన కాస్ట్యూమ్స్ లో రెడీ అవుతుంది.

ఇప్పుడు తన కొడుకును కిచెన్‌ లోకి తీసుకు వెళ్లి వార్తల్లో నిలిచింది. న్యూ ఇయర్‌ సందర్భంగా ఫ్యాన్స్ తో చిట్‌ చాట్ సందర్భంగా కొత్త సంవత్సరంలో నా కొడుకును కిచెన్‌ లోకి తీసుకు వెళ్లాలి అనుకుంటున్నట్లుగా పేర్కొంది.

అన్నట్లుగానే అల్లు అయాన్‌ ను కిచెన్‌ లోకి తీసుకు వెళ్లి అక్కడ పని కూడా అయాన్ తో చేయించడం జరిగింది.

తల్లి స్నేహా రెడ్డికి జూనియర్ ఐకానిక్‌ స్టార్‌ హెల్ప్‌ చేసే విధంగా కూరగాలను కట్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అల్లు అయాన్ కు ఇలాగే ట్రైనింగ్ ఇస్తే కచ్చితంగా అతడు పెళ్లి అయిన తర్వాత ఒక మంచి చెఫ్‌ అవ్వగలడు అంటూ సరదాగా కామెంట్స్‌ చేస్తున్నారు.

కెమెరా ముందు హీరో గా నటించాల్సిన కుర్రాడిని ఇలా కూరగాయలు కట్‌ చేయిస్తున్నారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అల్లు వారి చిన్న బాబు కిచెన్‌ లో ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతూ ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News