ముగ్గురిలో పైచేయి సాధించేది ఎవ‌రు?

Update: 2022-09-22 17:30 GMT
ఈ శుక్ర‌వారం ముగ్గురు యంగ్ హీరోలు పోటీప‌డుతున్నారు. జూన్‌, జూలై నెల‌ల్లో టాలీవుడ్ కు వ‌రుస షాకులు ల‌భించిన విష‌యం తెలిసిందే. ఆ రెండు నెల‌ల్లో రిలీజైన ప్ర‌తీ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ గా నిలిచింది. అయితే ఆ త‌రువాత ఆగ‌స్టు లో వ‌చ్చిన మూడు సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లుగా నిలిచి మ‌ళ్లీ ఇండ‌స్ట్రీకి ఊపిరి పోశాయి. ఇదిలా వుంటే సెప్టెంబ‌ర్ లో విడుద‌లైన చాలా సినిమాలు ఆశించిన ఫ‌లితాల్ని రాబ‌ట్ట‌లేక‌పోవ‌డంతో ఇప్ప‌డు అంద‌రి దృష్టి ఈ వారం రిలీజ్ కు రెడీ అయినా అల్లూరి, కృష్ణ వ్రింద విహారి, దొంగ‌లున్నారు జాగ్ర‌త్త సినిమాల‌పై ప‌డింది.  

శ్రీ‌విష్ణు చాలా రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. రీసెంట్ గా చేసిన సినిమాలేవీ పెద్ద‌గా ఆడ‌క‌పోవ‌డంతో లేటెస్ట్ గా `అల్లూరి` సినిమా చేశాడు. ఈ సినిమా విశేషం ఏంటంటే ఇందులో శ్రీ‌విష్ణు తొలిసారి ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించ‌డం, అల్లూరి సీతారామ‌రాజు స్ఫూర్తితో ఈ పాత్ర‌ని, క‌థ‌ని రాసుకోవ‌డంతో ఈ సినిమాపై శ్రీ‌విష్ణు ప్ర‌త్యేక దృష్టిని పెట్టాడు. సెప్టెంబ‌ర్ 23న రిలీజ్ కానున్న ఈ మూవీ శ్రీ‌విష్ణు న‌మ్మ‌కాన్ని ఏ మేర‌కు నిల‌బెడుతుందో చూడాలి.

హీరో నాగ‌శౌర్య న‌టించిన రొమాంటిక్ ల‌వ్ స్టోరీ `కృష్ణ వ్రింద విహారి` రిలీజ్ కాబోతోంది. సినిమా మ‌రి కొన్ని గంట‌ల్లో రిలీజ్ కానున్న నేప‌థ్యంలో గురువారం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. యుఏ స‌ర్టిఫికెట్ ల‌భించింది. ఇక ర‌న్ టైమ్ ని కూడా లాక్ చేశారు. జ‌స్ట్ 2 అవ‌ర్స్ 19 మినిట్స్ మాత్ర‌మే. అంతే కాకుండా ఈ మూవీ టికెట్ ప్రైస్ ని నేష‌న‌ల్ సినిమాడే సంద‌ర్భంగా పీవీఆర్ లాంటి మల్టీప్లెక్స్ ల‌లో రూ. 112 మాత్ర‌మేన‌ని చిత్ర బృందం ప్ర‌చారం చేస్తోంది.

గ‌త కొంత కాలంగా స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో నాగ‌శౌర్య‌కు ఈ మూవీ స‌క్సెస్ అనివార్యంగా మారింది. రొమాంటిక్ కామెడీ ల‌వ్ స్టోరీగా కొత్త పంథాలో రూపొందిన ఈ మూవీ నాగ‌శౌర్య‌కు హిట్ ఇస్తుందా? అన్న‌ది మ‌రి కొన్ని గంట‌ల్లోనే తేల‌బోతోంది. ఇక ఇదే రోజున యంగ్ శ్రీ సింహా న‌టించిన `దొంగ‌లున్నారు జాగ్ర‌త్త‌` రిలీజ్ అవుతోంది. హాలీవుడ్ ఫిల్మ్ `44` ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేసిన‌ట్టుగా చెబుతున్నారు. ఈ మూడు సినిమాలు భిన్న‌మైన జోన‌ర్ లో రూపొందినవే. మ‌రి ఈ ముగ్గురిలో పైచేయి సాధించేది ఎవ‌రు? అన్న‌ది తెలియాలంటే శుక్ర‌వారం వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News