విక్రమార్కుడు సినిమాను ఇంగ్లీష్ లో తీయాలట..!

Update: 2023-01-02 05:30 GMT
మళయాళ ప్రేమమ్ డైరెక్టర్ ఆల్ఫోన్స్ పుత్రెన్ ఒక్క సినిమాతోనే తన మార్క్ చూపించాడు. ప్రేమమ్  సినిమా ఎన్నో భాషల్లో రీమేక్ అయ్యి అక్కడ కూడా సక్సెస్ అందుకుంది. ఆ సినిమాతోనే అనుపమ, సాయి పల్లవి లాంటి హీరోయిన్స్ క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఏడు ఏళ్ల తర్వాత ఆల్ఫోన్స్ పుత్రెన్ గోల్డ్ అనే సినిమా తీశాడు. కనీసం టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండా సర్ ప్రైజ్ చేయాలని అనుకోగా ఆ సినిమా కాస్త డిజాస్టర్ అయ్యింది.

సినిమాలో పృథ్వీరాజ్, నయనతార లాంటి స్టార్స్ ఉన్నా కూడా గోల్డ్ నకిలీ గోల్డ్ అనిపించుకుంది. ఇక ఇదిలా ఉంటే ఈ డైరెక్టర్ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పి తన విష్ లిస్ట్ ఒకటి తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశాడు.

అందులో తెలుగు, తమిళ భాషలకు సంబంధించిన సినిమా విశేషాలు.. కొన్ని కాంబినేషన్స్ గురించి ఆల్ఫోన్స్ ప్రస్తావించాడు. వాటిలో ముఖ్యంగా రాజమౌళి తన విక్రమార్కుడు సినిమాని ఇంగ్లీష్ లో తీయాలని కాలేజ్ పాపల బస్సు పాటకి జాకీ చాన్, విల్ స్మిత్, ర్యాన్ గోస్లింగ్, స్కార్లెట్ జొహాన్సన్ ఇంకా సూటబుల్ యాక్ట్రెస్ డ్యాన్స్ చేయాలని. ఆ పాటను ఇప్పటి స్టైల్ కి తగినట్టుగా తీయాలని అన్నారు.

రాజమౌళికి ఇంటర్నేషనల్ ఐడెంటిటీ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన చేసిన బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలు ఆయన్ను ప్రపంచ సినిమాకు పరిచయం చేసింది. అందుకే ప్రేమమ్ డైరెక్టర్ తన విష్ లిస్ట్ లో రాజమౌళి విక్రమార్కుడు సినిమాని రీమేక్ చేయాలని కోరాడు.

ఇదే కాదు కమల్ హాసన్ సర్ 24 క్రాఫ్ట్స్ గురించి సినిమా ఎడ్యుకేషన్ వీడియోస్ చేయాలని దాని వల్ల లక్షల మంది కొత్త స్టూడెంట్స్ సినిమా గురించి తెలుసుకుంటారని కామెంట్ పెట్టాడు.

ఇంతేనా మోహన్ లాల్, మమ్ముట్టి కలిసి ఒక యాక్షన్ డ్రామా లో నటించాలని.. అది పృధ్వి రాజ్ డైరెక్ట్ చేయాలని.. ఇలా తన విష్ లిస్ట్ ని చాలా పెద్దదిగానే రాసుకున్నాడు ప్రేమమ్ డైరెక్టర్. ఇవన్ని జరుగుతాయా లేదా అన్నది పక్కన పెడితే ఒక డైరెక్టర్ గా తన విష్ లిస్ట్ ని ఫన్నీగా ఫేస్ బుక్ లో షేర్ చేసి ఆడియన్స్ ని అలరించాడు ఆల్ఫోన్స్. 


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News