తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమం గురించి తెలిసిందే. హైదరాబాద్ నగరం సహా రహదారుల వెంబడి మొక్కలు నాటించిన తెరాస ప్రభుత్వం హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టింది. అలాగే మంత్రి కేటీఆర్ సహా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమాన్ని అంతే సీరియస్ గా తీసుకుని ప్రచారం చేశారు.
ఈ ఉద్యమానికి సినీప్రముఖుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్- సమంత- బన్ని-ఎన్టీఆర్- ప్రభాస్ వంటి ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. దేశం.. రాష్ట్రం పచ్చగా ఉంటే పాలన పచ్చగా ఉన్నట్టు. ప్రజలు పచ్చగా ఉన్నట్టే అన్న ప్రాతిపదికన ఈ ఛాలెంజ్ లో అనేకమంది సెలెబ్రిటీలు పాల్గొని మొక్కలు నాటారు. అలా మొక్కలు నాటి మరికొంతమందికి ఛాలెంజ్ విసిరారు. ఈ తరహా ఛాలెంజ్ లు బాగానే వర్కవుటయ్యాయి. ఎందరో ఈ ఉద్యమంలో పాలు పంచుకుని మొక్కలు నాటారు.
తాజాగా అక్కినేని నాగార్జున భార్య అమల గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొనడమే గాక.. మొక్కలు నాటారు. తనలానే ఇందులో భాగస్వాములు కావాల్సిందిగా స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనకు ఛాలెంజ్ విసిరారు. ఇకపై ఉపాసన నుంచి ఇతర సెలబ్రిటీలు ఛాలెంజ్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యమంలో ఎంతమంది పాల్గొంటే వాతావరణ అంత పచ్చబడుతుందనే భావిద్దాం.