శ‌ర్వా త‌ల్లిగా అమ‌ల అక్కినేని!

Update: 2019-11-03 11:42 GMT
శేఖ‌ర్ క‌మ్ముల `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్` త‌ర్వాత వేరొక సినిమాకి అంగీక‌రించ‌లేదు అక్కినేని అమ‌ల‌. ఇటీవ‌లే హై ప్రీస్టెస్ అంటూ వెబ్ సిరీస్ తో ట‌చ్ లోకొచ్చారు. తాజాగా శ‌ర్వానంద్ సినిమాలో ఓ ఆస‌క్తిక‌ర పాత్ర‌కు సంత‌కం చేయ‌డం అక్కినేని ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

శర్వానంద్ - రీతు వర్మ జంట‌గా న‌టిస్తున్న తాజా సినిమా ప్ర‌స్తుతం సెట్స్ పై ఉంది. ఈ చిత్రంలో అమల అక్కినేని ... శర్వానంద్ తల్లిగా నటిస్తున్నారు. ఇదే చిత్రంలో కోలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తండ్రి రవి రాఘవేంద్ర అమల భర్తగా... శర్వానంద్ తండ్రిగా నటిస్తున్నారు.

స్నేహం ప్రేమ నేపథ్యంలో సాగే వినోదాత్మ‌క‌ చిత్ర‌మిది. అమల పాత్ర కీలకంగా ఉంటుంద‌ని తెలిసింది. త‌ల్లి కొడుకుల మ‌ధ్య అనుబంధానికి సంబంధించ చ‌క్క‌ని ఎమోష‌నల్ ఎలిమెంట్స్ ఆక‌ట్టుకుంటాయ‌ట‌. కార్తీక్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కార్తీ ఖైదీ నిర్మాత‌లు నిర్మిస్తున్నారు. శ‌ర్వా-రీతు వ‌ర్మ జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమాని తెలుగు-త‌మిళంలో రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. ఇక ఇందులో అమ‌ల న‌టించ‌డం ప్ల‌స్ కానుంది. ఇటీవ‌ల ఎన్ని అవ‌కాశాలు వ‌చ్చినా తిర‌స్క‌రించిన ఈ సినిమాలో న‌టించేందుకు ఎలా అంగీక‌రించారు? అంటే .. శ‌ర్వా నేరుగా వెళ్లి నాగార్జున‌ను క‌న్విన్స్ చేశార‌ట‌. నాగ్ రిక‌మండేష‌న్ తో అమ‌ల‌ను ఒప్పించార‌ట‌.
Tags:    

Similar News