ఒకప్పుడు వెండి తెరపై హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన అమల నాగార్జునాని పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరమైంది. చాలా గ్యాప్ తర్వాత ఇటీవల కాలంలో అతిథి పాత్రల్లో నటిస్తూ అలరిస్తోంది. ఆమెకు చాలా అవకాశాలు వస్తున్నప్పటికీ పెద్దగా ఆసక్తి చూపించడంలేదట. ఒకవేళ పాత్ర నచ్చి చేసినా...కూడా కేవలం పదిరోజుల కాల్షీట్ మించి ఇవ్వకూడదనే నిర్ణయానికొచ్చిందట. ఈ సమయంలో ఒక సినిమా విషయమై కమల్ హాసన్ ఆమెను ఈ మధ్య కలిసినప్పుడు, తన తీసుకున్న నిర్ణయాన్ని నిర్మొహమాటంగా చెప్పిందట. దానికి ఆయన కూడా సరే అన్నాడట. అతిథి పాత్ర కాబట్టి అంతకు మించి ఎక్కువ రోజులు అవసరముండదని కమల్ చెప్పినట్లు తెలుస్తోంది.
దర్శకుడు టి.కె.రాజీవ్ చెప్పిన కథతో పాటు ఆమె పాత్ర కూడా అమల కు బాగా నచ్చడంతో నటించడానికి వెంటనే ఓకే చెప్పిందట అమల. తెలుగు - తమిళ - మలయాళ - హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అమ్మానాన్న ఆట అనే టైటిల్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను స్వయంగా కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయని తెలుస్తోంది. జిబ్రాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సంక్రాంతి తర్వాత షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.