లైఫ్ లో ఎన్నో ఉద్వేగాల్ని ఎదుర్కొంది. ఎత్తు పల్లాలు చూసింది. సాటి కథానాయికలతో పోలిస్తే జీవితంలో లోతెంతో చూసే అవకాశం తనకే దక్కింది. అగ్ర కథానాయికగా రాజ్యమేలి... అంతలోనే పెళ్లి పేరుతో అన్నిటికీ దూరమైంది. ఆ తర్వాత ఇంకా ఎన్నో ఉద్వేగాలు. ఆఫ్టర్ మ్యారేజ్ జీవితంలో వైఫల్యం.. కలతలు.. చికాకులు.. అన్నిటినీ భరించింది. చిన్న వయసులోనే ఎన్నిటినో చూసింది. సుచీలీక్స్ సెన్సేషన్స్ లోనూ తన పేరు వినిపించింది. అసలు కెరీర్ ఆరంభించిందే ఓ బూతు సినిమాతో అని ప్రచారం సాగింది. చివరికి బెంజి కార్ కూడా తనని వెంటాడిందంటే .. అసలు అన్ని ట్విస్టులు ఎవరి జీవితంలో అయినా ఉంటాయా? బుచ్చిబాబు చెప్పినట్టు చివరికి మిగిలేది ఏది? అన్న చందంగా లోతుల్ని స్పర్శించింది.
అందుకే ఎందరు కథానాయికలు ఉన్నా అమలాపాల్ స్పెషల్. ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో అమలాపాల్ ఎంతగా అలసి సొలసి విసిగి వేసారిపోయిందో అర్థం చేసుకోవాల్సిందే. అదంతా సరే.. అంతగా జీవితం అనే అంకంలో అలసిసొలసినప్పుడు సేద దీరాంలంటే ఏం చేయాలి? అలల తాకిడితో ఎగసిపడే సముద్రంలోకి కళ్లు పెట్టి చూడాలి. లేదంటే ఇదిగో అమలాపాల్ చేస్తున్నట్టు నదులు - సరస్సులు - కాలువల్లో బోట్ షికార్ కి అయినా వెళ్లాలి. అన్నిటినీ మరిచి అందమైన ప్రకృతిని వీక్షించే అవకాశం దక్కుతుంది.
స్వస్థలం కేరళలో ఇలా బోట్ షికార్ కి బయల్దేరిన అమలా పూర్తిగా అన్నిటినీ మరిచి హాయిగా ఎంజాయ్ చేస్తుంది. పొట్టి నిక్కరులో స్వేచ్ఛగా షికారుని కొనసాగించింది. ఆ బోట్ లో నిదురించడానికి చాప - ఆ పక్కనే రెడ్ కలర్ బ్యాగు ఉన్నాయి. మొత్తానికి ఇలాంటి అరుదైన అవకాశం అందరికీ రానేరాదు. ఆ క్షణం జీవితాన్ని నచ్చినట్టు ఎంజాయ్ చేసేయాలంతేనని అమలాని చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజైన `ఆడై` టీజర్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కామిని అనే ఆసక్తికర పాత్రలో నటిస్తోంది. `ఆడుజీవితం` అనే చిత్రంలోనూ నటిస్తోంది.