లుంగి డ్యాన్స్ లుంగి డ్యాన్స్ .. అంటూ బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్- దీపిక పదుకొనే వేసిన మాస్ స్టెప్పుల్ని ఇప్పటికీ అభిమానులు మర్చిపోలేరు. సూపర్ స్టార్ రజనీకాంత్ - తళా అజిత్ - సూర్య - విక్రమ్ - విజయ్ లాంటి స్టార్లు లుంగీలు కట్టి మాస్ లో ఎంతగా పాపులరయ్యారో గుర్తు చేస్తూ.. దానిపై సెటైరికల్ కామెడీ క్రియేట్ చేసినా.. బాద్ షా ఆహార్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు వోన్ చేసుకున్నారు.
ఆ తర్వాత దీపికను చూసి.. ఇతర కథానాయికలు లుంగీ కట్టడం అన్నది ఫ్యాషన్ గా మారింది. చాలా సినిమాల్లో మన ట్యాలెంటెడ్ దర్శకులు హీరోయిన్లతో లుంగీలు కట్టించారు. సమంత - తమన్నా - కీర్తి సురేష్ ఒకరేమిటి అందరితోనూ లుంగీలు కట్టించారు. ఇంతమందికి లేని సిగ్గు నాకెందుకు? అన్నట్టే ఉంది అమలా పాల్ తీరు. ఈ భామ లుంగీ కట్టి యూత్ ని టీజ్ చేస్తోంది.
నాకంటే గొప్పగా లుంగీ కట్టేదెవరు? అంటూ పిక్కలపైకి ఎర్ర లుంగీ కట్టి హడావుడి చేస్తోంది. తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన అమలాపాల్ లుంగీ లుక్ యువతరంలో జోరుగా వైరల్ అవుతోంది. `వెల్ కం టు ద ల్యాండ్ ఆప్ లుంగీ` అంటూ కొటేషన్ కూడా ఇచ్చింది. పైన బులుగు టీషర్టు.. కింద ఎర్ర లుంగీ ఆ కాంబినేషనే యమ రంజుగా ఉందంటూ యూత్ ఫిదా అయిపోతున్నారు. లుంగీ కట్టులో ఉన్న అమలాపాల్ అలా ఓ లుక్కిచ్చి పరేషాన్ చేసేసిందంతే. ప్రస్తుతం సినిమాల్లేక ఖాళీగా ఉంటోంది.ఈ ఖాళీ సమయంలోనే ఇటీవల కేరళలోని ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ బోట్ షికార్లు చేసింది. ఇంటీరియర్ ప్లేస్ లో షికార్లకు వెళ్లిన అమలా పాల్ తనివితీరా ఆ అందాల్లో తనివితీరా తిరిగి వచ్చింది. అప్పుడే ఇలా లుంగీ కట్టి ఫోజిచ్చిందో లేక ఇంకేదైనా సందర్భమో తెలియాల్సి ఉంది. లుంగీలో వెళ్లిన పాల్ ఆ ప్రకృతి రమణీయమైన కాలువ గట్టున ఏం చేస్తోందే ఏంటో!!