పారే కాలువ‌లోకి దూకేస్తోంది బాబోయ్‌

Update: 2019-09-06 15:32 GMT
పారుతున్న కాలువ‌లో ఈత కొట్టేందుకు వెళ్లి గ‌ల్లంతైన కేసులెన్నో పొద్దున్నే ప‌త్రిక‌ల్లో చ‌దువుతుంటాం. కానీ ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న ఈ అమ్మ‌డికి అస‌లు అలాంటి భ‌య‌మే లేన‌ట్టుంది. ఒక వాట‌ర్ చెక్‌ డ్యామ్ నుంచి పారుతున్న కాలువ‌లోకి ఎలాంటి భ‌యం లేకుండా దూకేస్తోంది! అస‌లు ర‌న్నింగ్ వాట‌ర్ లోకి జంపింగ్ అంటే ఎన్ని గ‌ట్స్ ఉండాలి? ఇక్క‌డ‌ బికినీ బేబి గ‌ట్స్ కి ప‌రేషానవ్వాల్సిందే. ఇంత‌కీ ఎవ‌రీ బేబి అంటే.. ఇంకెవ‌రు... అమ‌లాపాల్.

ఇటీవ‌లే `ఆమె`లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలో అద్బుతంగా న‌టించి మ‌తులు చెడ‌గొట్టింది. రోడ్ల‌పై రియాలిటీ షో పేరుతో బెట్టింగులు క‌ట్టి జీవితాల‌తో ఆడుకునే చానెల్ రిపోర్ట‌ర్ గా న‌టించిన అమ‌లాపాల్.. అచ్చు గుద్దిన‌ట్టు ఒదిగిపోయి నటించింది. మీడియా చానెల్ ఆఫీస్ లో రాత్రంతా న‌గ్నంగా గ‌డిపి తాగిన మ‌త్తులో ఆక‌తాయి పాల్ చిత్తుగా చేసిన ప‌నుల‌న్నీ ప్రేక్ష‌కుల‌కు గుర్తున్నాయ్. చాలా కాలం త‌ర్వాత గ‌ట్సీగా.. ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎంచుకుని ఆ పాత్ర‌లో అమ‌లాపాల్ జీవించేసింది. ఈ అమ్మ‌డి న‌ట‌న‌కు అవార్డొస్తుందేమో చూడాలి.

నెక్ట్స్  సీనేంటి? అంటే.. ఆ త‌ర‌వాత ప‌లు చిత్రాల‌కు క‌మిటైంద‌ట‌. ఈ గ్యాప్ లోనే ఇదిగో ఇలా పారే కాలువ‌ల్లో ఈత కొట్టేందుకు రెడీ అయ్యింది. రెండు కొండ‌ల్ని ప‌గ‌ల‌గొట్టి ఆ డ్యామ్ ని నిర్మించారు. ఆ మధ్య‌లో కొండ వాలుగా అక్క‌డికి ఎలా చేరుకుందో కానీ అస‌లు భ‌యం అన్న‌దే లేదాయె! అంద‌రిలా ఉంటే అమ‌లాపాల్ అని ఎందుకంటారు? అందుకే ఇలా సాహ‌సాలు చేస్తోంద‌న్న‌మాట‌. ``ప్ర‌తిదీ  చంపేసేదే. అలాంటి ప‌నులే న‌న్ను జీవించేలా చేస్తున్నాయ్!`` అంటూ ఈ ఫోటోకి అదిరిపోయే క్యాప్ష‌న్ ఇచ్చింది. బ్లాక్ వాట‌ర్స్ లో ప‌చ్చ బికినీ ధ‌రించిన మ‌త్స్యంలా అమ‌లాపాల్ ఈత కొడుతుంటే చూసే భాగ్యం ఎంద‌రికి క‌లుగుతుందో చెప్మా?

    

Tags:    

Similar News