వివాదాల సుడిలో పడుతూ లేస్తూ వస్తున్న బహుబాషా నటి అమలాపాల్ కు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే... ఆగలేక పెళ్లి చేసేసుకున్న అమలాపాల్... ఆ ముచ్చట కూడా తీర్చేసుకుని ఎంచక్కా విడాకులు తీసేసుకుంది. భర్త నుంచి విడిపోయిన తర్వాత ఈ అమ్మడు తెగ వివాదాల్లో ఇరుక్కుపోయింది. మాట్లాడే ప్రతి మాటను చాలా బోల్డ్ గా - ఇంకాస్త చెప్పాలంటే కాస్తంత పచ్చిగానే మాట్లాడేసిన అమలాపాల్... ఆ కామెంట్ల ద్వారానే కాస్తంత ప్రచారంలోకి వచ్చేసింది. ఆ కామెంట్ల కారణంగానే ఆమెను వివాదాలు చుట్టేశాయి.
తాజాగా ఆమెను చుట్టేసిన వివాదం ఏంటంటే... ట్యాక్స్ లు తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతంలో ఖరీదైన కారు కొనేసుకుని దానిని ఎంచక్కా తన సొంత రాష్ట్రం కేరళకు తీసుకురావడమే. ఇలా ట్యాక్స్ ఎగవేతలకు పాల్పడుతున్నది ఒక్క అమలనే కాకపోయినా... ఎంతైనా సెలబ్రిటీ కదా. చాలా ఈజీగానే ఆదాయపన్ను శాఖ అధికారులకు ఈ విషయం తెలిసిపోయింది. అంతేకాకుండా అమ్మడి అతి వాగుడు కూడా ఐటీ శాఖకు ఆమె టార్గెట్ అయ్యేలా చేసిందని చెప్పాలి. అయినా ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే... ఏ క్షణమైనా అమలాపాల్ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉందట. ఇప్పటికే అమలాపాల్ మాదిరిగానే యువ నటుడు ఫవాద్ ఫాజిల్ కూడా కేంద్ర పాలిత ప్రాంతంలో కారు కొనేసి కేరళకు తీసుకొచ్చేసిన ఘటనలో అరెస్టయ్యాడు. అయితే అప్పటికప్పుడే అతడు బెయిల్ తీసుకుని బయటకు వచ్చేశాడు.
మరి ఈ తరహా కేసులోనే ఇప్పటికే కేసులు నమోదైన అమలాపాల్ ను అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధమవుతోందన్న పుకార్లు మొదలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న అమలాపాల్ కూడా బెంబేలెత్తిపోయి... ఎక్కడ తనను అరెస్ట్ చేస్తారోనన్న భయంతో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకుందట. కోర్టులో అమలా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కు న్యాయమూర్తి సరేనంటే ఫరవా లేదు గానీ... పిటిషన్‌ను తిరస్కరణకు గురైతే మాత్రం ఈ అమ్మడు అరెస్ట్ కాక తప్పదన్న వాదన వినిపిస్తోంది. చూద్దాం... ఏం జరుగుతుందో?