హీరోయిన్ గా మంచి స్థాయిలో ఉండగా.. చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసేసుకుంది అమలా పాల్. విజయ్.. ఆమె ఒకరినొకరు ఎంతో ఇష్టపడి పెళ్లాడారు. కానీ రెండేళ్లు తిరక్కుండానే విడిపోయి ఆశ్చర్యపరిచారు. ఇద్దరూ వేర్వేరు సందర్భాల్లో ఒకరి గురించి ఒకరు మాట్లాడిన తీరు చూస్తే పరస్పరం ప్రేమాభిమానాలేమీ తగ్గిపోలేదనే అనిపిస్తుంది. కానీ ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో అర్థం కాదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అమల మాట్లాడుతూ ఇప్పటికీ విజయ్ అంటే తనకు ఇష్టమే అని చెప్పడం విశేషం. విజయ్ మీద తనకెలాంటి కోపం లేదని.. అలాగే అతడి నుంచి విడిపోయినందుకు తానేమీ అప్సెట్ కూడా కావడం లేదని ఆమె తెలిపింది.
విజయ్ నుంచి వేరు పడ్డాక అమల వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి విజయ్ దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే నటిస్తావా అని అమలను అడిగితే.. సూటిగా సమాధానం చెప్పకుండా వేదాంతం వల్లించిందామె. ‘‘జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ప్రస్తుతానికి నేను సినిమాల్లో నటించడం తప్ప ఇతర విషయాల గురించి నేను ఆలోచించడం లేదు. మేమొకటి తలిస్తే విధి మరొకటి తలచింది. ఈ జీవిత ప్రయాణంలో మన దరికి వచ్చిన అంశాలను, అవకాశాలను అంగీకరించి ముందుకు వెళ్లాలి. విజయ్ నుంచి నేను వ్యక్తిగతంగా మాత్రమే విడిపోయాను. వృత్తిపరమైన సంబంధాలు కొనసాగుతాయి’’ అని అమల చెప్పింది. అంటే విజయ్ తనకేదైనా పాత్ర ఇస్తే చేయడానికి రెడీ అన్నదే అమల ఉద్దేశం కావచ్చు. మరి విజయ్ ఆమెతో పని చేయడానికి రెడీనా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/