ఫ్యాన్ రూ.12లక్షల బిల్లు కట్టిన తారక్.. ఇంటికెళ్లే వరకు దగ్గరుండి!

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బిగ్ ఫ్యాన్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన కౌశిక్.. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-12-25 05:43 GMT

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బిగ్ ఫ్యాన్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన కౌశిక్.. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. దేవర సినిమా చూడాలని ఉందని, రిలీజ్ వరకైనా తనను బతికించాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం వీడియోలో తెలిపాడు. అప్పుడు ఆ వీడియో తారక్ వరకు చేరగా.. ఆయన కౌశిక్ తో వీడియో కాల్ లో మాట్లాడారు.

ముందు ఆరోగ్యం అని.. ఆ తర్వాత సినిమా అని కౌశిక్ కు ఎన్టీఆర్ తెలిపారు. త్వరగా కోలుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. చికిత్సకు సహాయం చేస్తానని మాటిచ్చారు. అయితే రీసెంట్ గా కౌశిక్ ట్రీట్మెంట్ పూర్తి అవ్వగా ఆమె తల్లి సరస్వతి మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్.. తమకు ఎలాంటి సహాయం చేయలేదని ఆరోపించిన విషయం తెలిసిందే.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు టీటీడీ నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందిందని తెలిపారు. ఇంకా రూ.12 లక్షలు కడితే తన కొడుకు డిశ్చార్జ్ అవుతాడని చెప్పారు. కాబట్టి అందరూ సహాయం చేయాలని, ఎన్టీఆర్ కూడా స్పందించాలని విన్నవించుకున్నారు. దీంతో తారక్.. వెంటనే రెస్పాండ్ అయ్యి ఆస్పత్రి బిల్లును కట్టారు.

ఆ విషయాన్ని కౌశిక్ తల్లి.. తన కుమారుడి డిశ్చార్జి తర్వాత మీడియాతో తెలిపారు. తనకు ఎన్టీఆర్ టీమ్ కాల్ చేసి మొత్తం వివరాలు తెలుసుకున్నారని తెలిపారు. కౌశిక్ పరిస్థితి గురించి వైద్యులతో కూడా వారు మాట్లాడినట్లు చెప్పారు. ఆ తర్వాత ఎన్టీఆర్ టీమ్ వాళ్ళు రూ.12 లక్షల బిల్లు కట్టి డిశ్చార్జి అయ్యే వరకు దగ్గరనున్నారని వెల్లడించారు.

అయితే తాను ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడలేదని, మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చానని తెలిపారు. "మా ఫ్యామిలీ అంతా తారక్ ఫ్యాన్సే. ఎప్పుడైనా ఆయన స్పీచ్ విన్నప్పుడు.. ఎవరైనా ఇలా ఉండాలని మా వాళ్ళందరూ అంటుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ సపోర్ట్ వల్ల మా అబ్బాయి డిశ్చార్జి అవుతున్నాడు" అంటూ థ్యాంక్స్ తెలిపారు.

"నా మాటల వల్ల తారక్ అభిమానులు కొంచెం ఇబ్బంది పడినట్టున్నారు. కానీ నేను తప్పుగా మాట్లాడలేదు. కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అబ్బాయి హెల్త్ బాగుండాలని మీరందరూ కోరుకున్నారు. కాబట్టి ఇప్పుడు డిశ్చార్జి అయ్యాడు" అని చెప్పారు.

Tags:    

Similar News