ఆకతాయికి అమల ఘాటైన కౌటర్!

Update: 2016-09-19 06:08 GMT
గతకొన్ని రోజులుగా అమలా పాల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. 2014 జూన్ 12న ప్రేమవివాహంతో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ తో వివాహ బంధాన్ని ఏర్పరచుకున్న అమలా పాల్.. తాజాగా ఆ వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకుంది. నాటి నుంచీ అమలా పాల్ మీడియాలో హాట్ టాపిక్కే. ఈ వ్యవహారంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్‌ లాంటి వ్యక్తిని వదులుకోవడం అమలా పాల్ చేస్తున్న పెద్ద తప్పే అని కొందరి వ్యాఖ్యానిస్తుంటే... అత్తామామలకు తీరు నచ్చకపోవడంవల్లే అమలా ఇంతదూరం వెళ్లిందని మరికొందరి సమర్ధన. ఆ సంగతులు అలా ఉంటే.. అమలాపాల్ పై తాజాగా సోషల్ మీడియాలో ఒక కామెంట్ కనిపించింది.. ఈ విషయంపై ఆమె ఘాటుగా స్పందించింది.

"విడాకులు తీసుకున్న మహిళలు ఎప్పుడూ హాట్‌ గా - నాటీగా ఉంటారు" అని సోషల్ మీడియాలో ఒక ఆకతాయి అమలా పాల్ లేటెస్ట్ ఫోటోపై కామెంట్ చేశాడు. అప్పటికే ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతున్నాయనే గాసిప్పుల మధ్య, విడాకులకు సంబందించిన కామెంట్స్ మధ్య నలిగిపోతున్న అమలకు ఈ కామెంట్ మరింత మంటను తెచ్చిందో ఏమో కానీ.. ఈ కామెంట్ ను ఏమాత్రం లైట్ తీసుకోకుండా ఘాటుగా రిప్లై ఇచ్చింది. "ఏయ్ అబ్బాయ్.. నీ యాంబిషన్ రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నట్లు అనిపిస్తోంది... దయచేసి మహిళలను గౌరవించడం నేర్చుకో" అని రిప్లై ఇచ్చింది.

కాగా విజయ్ తండ్రి అళగప్పన్ వల్ల అమలా పాల్ కు అవకాశాలు రావడంలేదని ఒక పక్క వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏకంగా సూపర్‌ స్టార్ రజనీకాంత్ సరసనే ఛాన్స్ వచ్చిందని టాక్ వినిపించింది. కబాలి దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో రజనీ హీరోగా ధనుష్ నిర్మించనున్న సినిమాలో అమలా పాల్‌ ను హీరోయిన్ గా ఎంపిక చేశారని గాసిప్స్ వస్తున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News