తొలిసారిగా విడాకుల‌పై స్పందించిన అమ‌లాపాల్‌.. వాళ్ల‌ని న‌మ్మొద్ద‌‌న్న హీరోయిన్‌!

Update: 2021-02-27 15:30 GMT
కోలీవుడ్ బ్యూటీ అమలాపాల్.. దర్శకుడు విజయ్‌ను 2014 లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కానీ.. వీరి వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. అభిప్రాయా భేదాల‌తో ఇద్ద‌రూ మూడేళ్ల‌కే విడిపోయారు. వీరిద్ద‌రూ 2017లో విడాకులు తీసుకున్నారు.అయితే.. విడాకులు తీసుకున్న రోజు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న ప‌రిస్థితిపై అమ‌లాపాల్ స్పందించ‌లేదు. కానీ.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మ‌న‌సు విప్పారు అమ‌లా. ఆ కఠినమైన కాలంలో తన ప‌రిస్థితిని వెల్లడించారు.

ఓ మీడియా హౌస్ లో మాట్లాడిన అమ‌లాపాల్‌.. భ‌ర్త‌తో విడిపోయిన సమయంలో తనకు ఎవ్వ‌రూ మద్దతుగా నిల‌బ‌డ‌లేద‌ని అన్నారు. అంతేకాదు.. ప్రతిఒక్కరూ ఆమెలో ఒక‌విధ‌మైన‌ భయాన్ని సృష్టించార‌ని చెప్పారు. మ‌గ‌తోడు లేక‌పోతే జీవితం దుర్భ‌రంగా ఉంటుంద‌ని భ‌య‌పెట్టార‌ట‌. ఇలా ఎవ‌రికి వారు స‌ల‌హాలు ఇచ్చివెళ్లారే త‌ప్ప‌.. త‌న మానసిక ప‌రిస్థితి గురించి, డిప్రెష‌న్ గురించి ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు అమ‌లాపాల్‌.

దీంతో.. తాను క‌ఠిన నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు చెప్పిందీ హీరోయిన్‌. తాను సాధార‌ణంగా ఉండ‌కూడ‌ద‌ని డెసిష‌న్ తీసుకున్నాన‌ని, తన జీవితాన్ని త‌న‌కు కావాల్సిన విధంగా జీవించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెప్పారు. మన గత జీవితాన్ని గుర్తుచేసుకొని, భ‌విష్య‌త్ వైపు అడుగులు వేయాల‌ని సూచించారు. ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కేవలం షో చేస్తుంటార‌ని, ఆ ఫేక్ షోను గుర్తుప‌ట్టాల‌ని తెలిపారు అమలా పాల్‌.
Tags:    

Similar News