ట్రైల‌ర్ : ర‌వితేజ రొటీన్ గిఫ్ట్?

Update: 2018-11-11 04:14 GMT

మాస్ మ‌హారాజా ర‌వితేజ - శ్రీ‌నువైట్ల కాంబినేష‌న్ మూవీ `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` ఈనెల 16న గ్రాండ్‌ గా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శ‌నివారం రాత్రి జేఆర్‌ సీ సెంట‌ర్‌ లో అభిమానుల స‌మ‌క్షంలో వైభ‌వంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు ఇలియానా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఈవెంట్ ఆద్యంతం ర‌వితేజ ఫ్యాన్స్ ఉల్లాసంగా ఉర‌క‌లెత్తించారు.

లేటెస్ట్‌ గా `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` ట్రైల‌ర్ రిలీజైంది. ఈ ట్రైల‌ర్ ఆద్యంతం ర‌వితేజ త్రి పాత్ర‌ల్ని రివీల్ చేస్తూ సినిమా పై ఆస‌క్తిని పెంచే ప్ర‌య‌త్నం చేశారు. ఇదివ‌ర‌కూ రిలీజైన టీజ‌ర్‌ కి మ‌రో రెగ్యుల‌ర్ వైట్ల టైప్ మూవీ అన్న నెగెటివ్ టాక్ రావ‌డంతో ఆ మేర‌కు శ్రీ‌ను ట్రైల‌ర్ విష‌యంలో కాస్తంత జాగ్ర‌త్త తీసుకున్నార‌నే అనిపిస్తోంది. శ్రీ‌ను వైట్ల త‌ర‌హా యాక్ష‌న్ కామెడీ ఎంట‌ర్‌ టైన‌ర్ ఈ చిత్రం. ఇందులో అమ‌ర్ సాఫ్ట్ గా ట‌క్కు టై క‌ట్టుకుని క‌నిపించే కార్పొరెట్ దిగ్గ‌జంగా క‌నిపిస్తుంటే - అక్బ‌ర్ మాస్ ట‌చ్ ఉన్న ముస‌ల్మాన్ పాత్ర‌. ఆ ఇద్ద‌రికీ డిఫ‌రెంట్ గా ఆంటోని పాత్ర క‌నిపిస్తోంది. డాక్ట‌ర్ ఆంటోని .. అత‌డితో ఇలియానా రొమాంటిక్ ట‌చ్ గురించి ట్రైల‌ర్‌ లో రివీల్‌ చేశారు. వీళ్ల మ‌ధ్య‌లో వెన్నెల కిషోర్ కామెడీ ట‌చ్ ట్రై చేశాడు. మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమా కోసం అమెరికా షెడ్యూల్‌ ని భారీగా ప్లాన్ చేసింది. అక్క‌డ విజువ‌ల్ రిచ్ లొకేష‌న్ల‌లో ఈ సినిమాని తెర‌కెక్కించేందుకు భారీగానే ఖ‌ర్చు చేశార‌ని అర్థ‌మ‌వుతోంది. ర‌వితేజ మూడు గెట‌ప్పులు - ఆహార్యం అంతా ఫ‌క్తు ఫార్ములాటిక్‌... మాస్‌ ని మెప్పించేందుకు చేసిన ప్ర‌య‌త్న‌మేన‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే రొటీన్ స్లాప్‌ స్టిక్ కామెడీని మ‌రోసారి శ్రీ‌ను చూపిస్తున్నాడా? అన్న డౌట్స్‌ ని రెయిజ్ చేసింది ట్రైల‌ర్‌. ఇటీవ‌లి కాలంలో సినిమా క‌థ‌ల్లో ద‌మ్ము లేక‌పోతే ఎంత విజువ‌ల్ రిచ్‌గా చూపించినా ఆ సినిమాల‌కు గ‌డ్డు కాలం ఎదుర‌వుతోంది. ఆ త‌ప్పు శ్రీ‌నువైట్ల రిపీట్ చేయ‌లేద‌నే భావిద్దాం. రొటీన్ ఫార్ములాతో క‌నిపించినా ట్రైల‌ర్ అల్ట్రా రిచ్ లుక్‌ తో ఆక‌ట్టుకుంది. త‌మ‌న్ నేప‌థ్య సంగీతం మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌.

``ఈ ప్ర‌పంచంలో శ‌క్తి  చాల‌క న‌మ్మ‌కం నిల‌బెట్టుకోలేని వాళ్లు కొంద‌రుంటే శ‌క్తి మేర‌కు న‌య‌వంచ‌న చేసేవాళ్లు కోకొల్ల‌లు`` అంటూ శ్రీ‌ను వైట్ల బ్యాక్‌ గ్రౌండ్ వాయిస్‌ ట‌చ్ బావుంది. న‌య‌వంచ‌కుల‌ను వేటాడేందుకే అమ‌ర్ -అక్బ‌ర్ - ఆంటోని లా ర‌వితేజ గెట‌ప్పులు మార్చాడ‌ని ట్రైల‌ర్‌ లో చెబుతోంది. ``దిస్ ఈజ్ నాట్ ఏ రివెంజ్‌.. దిస్ ఈజ్ రిట‌న్ గిఫ్ట్`` అని మాస్ రాజా ఇచ్చిన పంచ్ బావుంది. ఇంత‌కీ బ్లాక్‌ బ‌స్ట‌ర్ ఇచ్చి అభిమానుల‌కు స‌ర్‌ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడంటారా?

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News