మెగాహీరో ఎంట్రీ తో అమెజాన్ కొత్త సిగ్మెంట్ లాంచింగ్!

Update: 2021-10-08 23:30 GMT
ఓటీటీ ప్లాట్ ఫాం ఎంత‌గా వృద్ధిలోకి వ‌చ్చిందో చెప్పాల్సిన ప‌నిలేదు. క‌రోనా రాక‌తో ఓటీటీ వ్య‌వ‌స్థ అంత‌కంత‌కు విస్త‌రించింది. చిన్న‌పాటి ఓటీటీ ల‌కు సైతం భారీగా స‌బ్ స్రైబ‌ర్లు పెరిగారు. ఇక అగ్ర గామి సంస్థ‌లైన నెట్ ప్లిక్స్..అమెజాన్ ప్రైమ్ లాంటి సంస్థ‌ల‌తో కొత్త ఫీచ‌ర్ల‌నే ప్ర‌వేశ పెడుతున్నాయి. వీలైనంత‌గా  ఓటీటీని ప్రేక్ష‌కుల‌కు సుల‌భ‌త‌రం..త‌క్కువ ధ‌ర‌కే అందించాల‌ని ఆఫర్లు ప్ర‌క‌టిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో తాజాగా అమెజాన్ ప్రైమ్  రీజిన‌ల్ మూవీస్ కోసం కొత్త సిగ్మెంట్ ను ప‌రిచ‌యం చేస్తుంది. ఇది కేవలం చిన్న సినిమాల కోస‌మే. కంటెంట్ ఉన్న అన్ని జోన‌ర్  సినిమాలు ఇందులో ప్ర‌సారం కానున్నా యి. దీనిలో భాగంగా యంగ్ హీరో విరాన్ ముత్తంశెట్టి న‌టించిన `బ్ర‌తుకు బ‌స్టాండ్` చిత్రం టెలికాస్ట్ కానుంది.  విరాన్ మెగా కుటుంబానికి దూర‌పు బంధువు. అల్లు అర‌వింద్ బావ‌మ‌రిది త‌న‌యుడు విరాన్.

దీంతో మెగా ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో ప‌రిచ‌యం అవుతుండ‌టం విశేషం. అలాగే ఐ.ఎన్ రెడ్డి అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. మెగా ఫ్యామిలీ హీరో కావ‌డంతో అభిమానులు ఎలా న‌టిస్తాడో చూద్దామ‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.
Tags:    

Similar News