పూరి-లావ‌ణ్య పెళ్లి చేసింది శంక‌ర‌న్న‌!

Update: 2022-07-14 01:30 GMT
పూరి జ‌గ‌న్నాధ్-లావ‌ణ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పూరి ద‌ర్శ‌కుడు కాక‌ముందే ఓ సినిమా షూటింగ్ స‌మ‌యంలో  లావ‌ణ్య ని చూసి ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకున్నారు. 'ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్' కి పూరి అతీతుడు కాదు. ఇప్పుడంటే? ప్రేమ‌..పెళ్లిళ్లు గురించి ఫీలాస‌పీలు వ‌ల్లిస్తున్నారు గానీ..ఒక‌ప్పుడు అవేం లేవు.

ఓ సామాన్యుడు అసామాన్యుడిగా మారిన త‌ర్వాత  పూరిలో వ‌చ్చిన మార్సులే ఇప్పుడు చూస్తున్న‌వ‌న్నీ. ఆ సంగ‌తి పక్క‌న బెడితే  కొద్ది రోజులుగా ఈ జంట గురించి మీడియా లో రక‌ర‌కాల నెగిటివ్ వార్త‌లు స్ర్పెడ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే నిర్మాత బండ్ల గ‌ణేష్ చేసిన కొన్ని వ్యాఖ్య‌లు అందుకు మ‌రింత ఆజ్యం పోసాయి. దీంతో కోడు గుడ్డు మీద ఈక‌లు పీకే కథ‌నాలు మ‌రింత పెట్రేగిపోయాయి.

తాజాగా పూరి-లావ‌ణ్య జంట‌కి పెళ్లి చేసిన పెద్ద వాట‌న్నింటిపై వివ‌ర‌ణ ఇచ్చారు. ఇంత‌కీ ఆ పెద్ద ఎవ‌రు?  ఆ జంట గురించి ఆయ‌న‌కు ఎలా తెలుసు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. ఆయ‌న ఎవ‌రో కాదు శంక‌ర్..అంబ‌ర్ పేట్ శంక‌ర‌న్న‌గా ఎంత ఫేమ‌స్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. శంక‌ర‌న్న ముఖానికి మ్యాక‌ప్ వేయ‌ని  అస‌లైన సెల‌బ్రిటీ.

తెలుగు రాష్ర్టాల్లోనే కాదు..ఇత‌ర రాష్ర్టాల నుంచి  శంక‌ర‌న్నకి  అభిమానులున్నారు. ముంబై  దిగ్గ‌జాల‌తో సైతం శంక‌ర‌న్న‌కి ప‌రిచ‌యాలున్నాయి. ఆయ‌న మంచిత‌నం చూసి మెచ్చి ఆయ‌న ద‌గ్గ‌ర‌కి వ‌స్తారు. ఆ ర‌కంగా శంక‌ర‌న్న ఎంతో ఫేమ‌స్ సెల‌బ్రిటీ. 'జ‌న‌తా గ్యారేజ్' స్టోరీ కూడా ఆయ‌న‌దే అంటారు. మోహ‌న్ లాల్ పాత్ర శంక‌ర‌న్న రియ‌ల్ లైప్ ది అని అంటారు.

అలాంటి శంక‌ర‌న్నే పూరి-లావ‌ణ్య పెళ్లి ద‌గ్గ‌రుండి చేసారుట‌. లావ‌ణ్య-శంక‌ర‌న్న కి ద‌గ్గ‌ర బంధువుట‌. ఇద్ద‌రు ఒక‌ర్ని ఒక‌రు ఇష్ట‌ప‌డ‌టం..ఆ విష‌యం శంక‌ర‌న్న‌కి తెలియ‌డంతో  పెళ్లి చేసారుట‌. అప్ప‌టి నుంచి పూరి త‌న‌కు తెల‌సుస‌న‌ని. ఇద్దరు మంచి స్నేహితులుగా మెలుగుతామ‌ని తెలిపారు. అప్పుడ‌ప్పుడు పూరి ఫోన్ చేసి మాట్లాడుతార‌ని...లావ‌ణ్య కూడా ఎప్పుడూ ఫోన్ ట‌చ్ లో ఉంటుంద‌ని.. ఇద్ధ‌రి మ‌ధ్య విబేధాలు ఏమైనా ఉంటే త‌న‌కి తెలియ‌వా? అని శంక‌రన్న అన్నారు.

ఇద్ద‌రు సంతోషంగా ఉన్నార‌ని..మీడియాలో వ‌స్తోన్న క‌థ‌నాల‌న్ని అవాస్త‌వ‌మ‌ని ఖండించారు. ఇంకా టాలీవుడ్ లో త‌న‌కున్న ప‌రిచ‌యాల  గురించి చెప్పుకొచ్చారు. చిరంజీవి గారు అంటే ఎంతో అభిమాన‌మ‌ని..ఆయ‌న‌కు తాను బాగా తెలుసున‌ని..ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తార‌ని  అన్నారు. ఇక శ్రీహ‌రి త‌న‌కు బ్ర‌ద‌ర్ లాంటి వారు అని అత‌ను లేక‌పోవ‌డంతో త‌నికి పెద్ద లోటుగా అనిపిస్తుంద‌ని శంక‌ర‌న్న  తెలిపారు.
Tags:    

Similar News