బాలకృష్ణ సినిమా 'వీరభద్ర' చిత్ర నిర్మాత అంబికా కృష్ణ మరియు దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి ల మద్య వివాదం ముదురుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నిర్మాత అంబికా కృష్ణ మాట్లాడుతూ దర్శకుడు రవికుమార్ తాగి సెట్స్ కు వచ్చే వాడు. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది. అతడు ఒక నీచుడు దుర్మార్ఘుడు అంటూ వ్యాఖ్యులు చేశాడు. అంబికా కృష్ణ ఇంకా దర్శకుడు రవికుమార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. నిర్మాత అంబికా కృష్ణ విమర్శలు ఆరోపణలపై దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి సీరియస్ గా స్పందించాడు. వాడు వీడు అంటూ వ్యాఖ్యలు చేయడం పై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాడు. మరోసారి తనను విమర్శిస్తూ ఊరుకునేది లేదు అన్నాడు.
దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ.. నేను ఎంతో మంది బ్యానర్ ల్లో సినిమాలు చేశాను. తాగి షూటింగ్ కు వెళ్తే వారు మళ్లీ మళ్లీ నాతో సినిమాలు ఎందుకు చేస్తారు. అంబికా కృష్ణ గారు నాకు సినిమా ఇచ్చారు.. డబ్బు ఇచ్చారు.. నా పెళ్లి చేశారు. ఆయనపై గౌరవం ఉంది. ఆయన సినిమా పోయిన సమయంలో బాధ ఉండటం మామూలే. మంచి సినిమాలు అనుకున్నవే ఫ్లాప్ అయ్యాయి. అంత మాత్రాన దర్శకుడిని తిట్టడం భావ్యం కాదన్నాడు. ఆయనంటే నాకు గౌరవం ఉంది. అదే సమయంలో ఆయన్ను చూస్తనే నాకు నవ్వు వస్తుంది. ఆయన కళ్ల జోడు ఆయన గెటప్ కు నవ్వుకుంటూ ఉంటాను. ఆయన ఎక్కడో హర్ట్ అయ్యాడు. డబ్బు పెట్టాడు కనుక మనసులో బాధ ఉండటం సబబే. అలాగని ఆయన మనసులో ఏదో అనుకుని నన్ను తిడుతూ చిన్న గొడవను బూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేయకూడదు.
నన్ను ఏదైనా అనాలంటే దిల్ రాజు గారు అల్లు అరవింద్ గారు అనవచ్చు. ఎందుకంటే వారితో నాకు ఇష్యూ ఉంది. కాని అంబికా కృష్ణ కు ఆ అర్హత లేదు. నేను ఈ విషయాన్ని ఇంకా లాగాలనుకోవడం లేదు. నాకు బొడ్డు కోసి పేరు పెట్టిన మేనమామ మాదిరిగా వాడు వీడు అని మాట్లాడారు. నేను పాజిటివ్ గానే ఉన్నా. ఇదే మాట వేరే వారు అని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇకపై వాడు వీడు అని మాట్లాడటం జరిగితే నేను ఎదురు తిరిగి మాట్లాడుతా. నాకేమైనా భయమా నేను ఎక్కడ నుండి వచ్చాను నా బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసు కదా.. గుంటూరోడు ఎలా ఉంటాడో మీకు తెలుసు కదా అంటూ నిర్మాత అంబికా కృష్ణకు వార్నింగ్ ఇచ్చాడు.