ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. బాలీవుడ్ తనని భరించలేదని మహేష్ చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. దీంతో బాలీవుడ్ అనుకూల వర్గం మహేష్ పై వ్యతిరేకత వ్యక్తం చేసింది. బాలీవుడ్ పరిశ్రమని ఎలా కించ పరుస్తారని ఆగ్రహ జ్వాలలు గుప్పించింది. మహేష్ చేసిన ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని..ఎందుకలా అన్నారో సరైన వివరణ ఇవ్వాలని డిమాండ్ వ్యక్తం చేసారు.
నేరుగా బాలీవుడ్ ప్రముఖులు మహేష్ వ్యాఖ్యల్ని ఖండించనప్పటికీ మనసులో అసంతృప్తి ఉందన్న విషయాన్ని వివిధ రూపాల్లో బయట పెట్టే ప్రయత్నం చేసారు. అయితే వీటిపై మహేష్ ప్రతినిధులు మాత్రం ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయలేదని..ఆయన ఏదో ఏంటే ఇంకెదో రాసారని..వైరల్ చేసారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. అయినా ఆ వేడి చల్లారలేదు. మహేష్ ఇంత వరకూ ఈ విషయంపై మీడియా ముందుకొచ్చి స్పందించింది లేదు. దీంతో ఆ దుమారం ఇప్పటికీ అలా రేగుతూనే ఉంది.
తాజాగా ఈ వివాదంపై బాలీవుడ నటి మీషా పటేల్ స్పందించింది. ''మహేష్ గౌరప్రదమైన మంచి వ్యక్తి. బాలీవుడ్ ని కించ పరచాలనే ఉద్దేశం తనది కాకపోవచ్చు. అతను తప్పు చేసే వ్యక్తి కాదు. ఎక్కడో మిస్టేక్ జరిగింది. అది ఎక్కడ జరిగిందో తెలుసుకుంటే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని' తెలిపింది.
మహేష్ తో అమీషా పటేల్ 'నాని' సినిమాలో జంటగా నటించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు 'బద్రీ' సినిమాలో నటించింది. కానీ హీరోయిన్ గా మాత్రం ఇక్కడ బిజీ కాలేకపోయింది. దీంతో బాలీవుడ్ కి వెళ్లి అక్కడే స్థిరపడింది. తాజాగా మహేష్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇలా వెలుగులోకి వచ్చింది. మహేష్ కి మద్దతుగానే అమీషా వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.
మరి ఇంకా ఎంత మంది బాలీవుడ్ సెలబ్రిటీలు మహేష్ కి సపోర్ట్ గా నిలుస్తారో చూద్దాం. మహేష్ వివాదాలకు చాలా దూరం. ఇప్పటిరకూ ఆయన పై ఒక్క నెగిటివ్ వార్త కూడా ఏనాడు రాలేదు.
కామ్ గోయింగ్ పర్సనాల్టీ. సినిమాలు..షూటింగ్..ఫ్యామిలీ తప్ప ఇంకెలాంటి విషయాల్లో వేలు పెట్టరు. అలాంటి మహేష్ తొలిసారి జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.