స‌ర్కార్ వారిపై అమెరికా రిపోర్ట్ ఇదీ

Update: 2022-05-12 03:49 GMT
సూపర్ స్టార్ మహేష్ - కీర్తి సురేష్ జంట‌గా ప‌ర‌శురామ్ తెర‌కెక్కించిన‌  సర్కార్ వారి పాట ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజ‌ర్ - ట్రైల‌ర్ - పాట‌ల‌తో మూవీపై బోలెడంత హైప్ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే.

అమెరికాలోనూ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా విడుద‌ల చేసారు. అయితే ఎంతో భారీ హైప్ తో వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉంది? అంటే.. ఇప్ప‌టికే అమెరికాలో ప్రీమియ‌ర్ వీక్షించిన ఆడియెన్ నుంచి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఎప్ప‌టిలానే మ‌హేష్ వైబ్రేంట్ పెర్ఫామెన్స్ 'స‌ర్కార్ వారి పాట‌'కు పెద్ద ప్ల‌స్. గ‌త చిత్రాల‌తో పోలిస్తే ఇందులో మ‌రింత స్మార్ట్ గా బెస్ట్ గా క‌నిపించాడు. అత‌డి డైలాగ్స్ న‌ట‌న ప్ర‌ధాన అస్సెట్. అలాగే ఇందులో కీర్తి సురేష్ కూడా ఎంతో అందంగా క‌నిపించింది.

కానీ త‌న పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్య‌త లేదు. తొలి నుంచి ప్ర‌చారం సాగిన చందంగానే ఇది బ్యాంకు అప్పులు రిక‌వ‌రీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా. మాస్ ఎలిమెంట్స్ యాక్ష‌న్ కి ప్రాధాన్య‌త ఉంది. నాయ‌కానాయిక‌లు షో స్టాప‌ర్స్ గా నిలుస్తారు.

ప్ర‌థ‌మార్థంతో పోలిస్తే ద్వితీయార్థంలో అంత కిక్కు లేదన్న టాక్ వినిపిస్తోంది. సెకండాఫ్ లో మహేష్ బాబు- కీర్తి సురేష్ ప్రేమ స‌న్నివేశాలతో డ్రాగింగ్ ఆస‌క్తిని క‌లిగించ‌వు. 'లారీ' సీన్ ద్వితీయార్థంలో సీరియ‌స్ సన్నివేశం. త‌ర్వాత సినిమా ఆశించినంత రైజ్ కి చేరుకోలేద‌ని యుఎస్ ఏ నుంచి రిపోర్ట్ అందింది.

పాట‌ల విష‌యానికి వ‌స్తే... పెన్నీ - కళావతి పాటలు కలర్ ఫుల్ గా సాగాయి. మా మా మహేశ పాట సోసోగానే సాగుతుంది. ఇక మ‌హేష్ ఫ్యాన్స్ కే కాకుండా జ‌న‌ర‌ల్ ఆడియెన్ కి మ‌హేష్ న‌ట‌న ఎన‌ర్జీ బాగా క‌నెక్ట‌వుతుంది. భారీ హైప్ తో విడుద‌లైన ఈ చిత్రం ఓపెనింగులు బాగానే రాబ‌డుతుంద‌ని అంచ‌నా. ఇది అమెరికా నుంచి తాజా రిపోర్ట్. తుపాకి పూర్తి రివ్యూ కోసం వేచి చూడండి.
Tags:    

Similar News