షారుక్ సినిమాతో విబేధాలు.. DOP ఔట్!

Update: 2022-07-13 11:52 GMT
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ వెండి తెరపై కనిపించి దాదాపు మూడేళ్లు కావస్తోంది. 2018 లో ఆయన జీరో సినిమా తర్వాత మళ్లీ మరొక సినిమా చేసింది లేదు. ఇక దాదాపు సినిమాలకు కూడా ముగింపు కార్డు పెట్టబోతున్నారు అనే వార్తలు వచ్చిన తరుణంలో ఆయన విభిన్నమైన ప్రాజెక్టులను తెరపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎప్పటి నుంచో ప్రముఖ దర్శకుడు రాజకుమారి హిరానీ తో కూడా సినిమా చేయాలి అని ఆలోచిస్తున్నా షారుక్ ఖాన్ మొత్తానికి ఆయనతో చేతులు కలిపారు.

వీరి కాంబినేషన్లో డుంకీ అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. డుంకీ సినిమాలో  తాప్సీ పన్ను కథానాయికగా నటించనుంది. తాజా వార్త ఏమిటంటే, దర్శకుడితో కొంత టెక్నికల్ గా విభేదాలు రావడంతో DOP అమిత్ రాయ్ ఈ చిత్రం నుండి వైదొలిగినట్లు తెలుస్తోంది.

 అతను ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజ్‌కుమార్ హిరానీతో చర్చించిన తర్వాత స్నేహపూర్వకంగానే ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.  

డుంకీ కోసం తాను దాదాపు 20 రోజులు పనిచేశానని కూడా ఆ సినిమాటోగ్రఫర్ చెప్పాడు. ఇప్పటికే సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది.  ఇప్పుడు హఠాత్తుగా కెమెరామెన్ ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఈ సినిమాను జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అలాగే రాజ్‌కుమార్ హిరానీ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తోంది.

ఈ చిత్రంలో బొమన్ ఇరానీ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.  డుంకీ సినిమాలో ఒక మెస్సేజ్ తో సోషల్ డ్రామాను హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది డిసెంబర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ఇక ఈ సినిమాలో సొట్టబుగ్గల తాప్సి మేయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా విక్కీ కౌషల్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమాతో షారుక్ ఖాన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Tags:    

Similar News