‘సైరా’ కోసం మాట్లాడుతున్నారు.. కన్ఫమ్ కాదు

Update: 2018-03-27 08:01 GMT
మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే దక్షిణాదిన ఎంతోమంది ప్రముఖ సంగీత దర్శకులు ఎగిరి గంతేసి ఓకే చెబుతారు. ఐతే ‘సైరా నరసింహారెడ్డి’ టీం మాత్రం ఇక్కడి వాళ్లెవ్వరూ వద్దని బాలీవుడ్ వైపు చూస్తోంది. ముందు ఎ.ఆర్.రెహమాన్‌ ను ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనుకున్నా.. ఆయన హ్యాండ్ ఇచ్చేయడంతో ఈ చిత్ర బృందం ఆలోచన మారింది. ‘సైరా’ను ‘బాహుబలి’ తరహాలో ఉత్తరాది జనాలకూ చేరువ చేయాలనే పట్టుదలతో ఉన్న ‘సైరా’ టీం రెహమాన్ తో కుదరనపుడు బాలీవుడ్ సంగీత దర్శకుడైతేనే న్యాయం చేయగలడని భావించింది. అందుకే అమిత్ త్రివేది కోసం ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలొచ్చాయి.

ఈ విషయాన్ని ‘సైరా’ నిర్మాత రామ్ చరణ్ స్వయంగా ధ్రువీకరించాడు. ‘సైరా’ కోసం అమిత్ త్రివేదితో సంప్రదింపులు జరుపుతున్న మాట వాస్తవమే అన్నాడు. ఐతే వీళ్లు అడగడం.. అతను ఔననో కాదనో చెప్పడమో వెంటనే జరిగిపోవాలి కానీ.. ఇలా సంప్రదింపులు జరుపుతూ ఉండటమేంటో అర్థం కావడం లేదు. అంటే వీళ్లకు అతను ఓకే కానీ.. ఈ సినిమాకు ఒప్పుకోవాలా వద్దా అని అతనే ఆలోచిస్తున్నాడన్నమాట. అసలు బాలీవుడ్లో అమిత్ చేసినవన్నీ పక్కా క్లాస్ సినిమాలు. అలాంటి సంగీత దర్శకుడు ‘సైరా’ లాంటి సినిమాకు సరిపోయే సంగీతం అందించగలడా అన్న సందేహాలు కొడుతున్నాయి. పైగా అతను వీళ్లను వెయిటింగ్ లో పెడుతున్నట్లుంది. దీని బదులు కీరవాణి.. తమన్.. దేవిశ్రీ ప్రసాద్.. వీళ్లలోనే ఒకరిని తీసుకుంటే అన్ని రకాలుగా బాగుండేదేమో అన్న అభిప్రాయం టాలీవుడ్ జనాల్లో కలుగుతోంది.


Tags:    

Similar News