డార్క్ వెబ్- క్రిప్టో కరెన్సీ గురించి విస్త్రతంగా చర్చ సాగుతోంది. సామాన్యులకు అంతగా అర్థం కాని సెన్సెక్స్ కి ఇది మరో రూపం అని చెబుతుంటారు. అయితే ఇందులో ఆరంభంలో పెట్టుబడులు పెట్టిన వారికి భారీ లాభాలు దక్కాయి. వందల కోట్ల ఆస్తులు పోగుపడ్డాయి. కానీ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా చాలామంది క్రిప్టోలో పెట్టుబడులు పెట్టి సర్వనాశనం అయ్యారు. భారత ప్రభుత్వ తాజా నిర్ణయం క్రిప్టో పెట్టుబడిదారులను భయపెట్టింది.
అయితే ఇదే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టిన ఒక స్టార్ ఫ్యామిలీ ఏకంగా 112కోట్లు సంపాదించింది. దీనికోసం వెచ్చించిన పెట్టుబడి కేవలం 1.6 కోట్లు మాత్రమే. ఇది వింటేనే.. ఔరా! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారా? కానీ ఇది నిజ్జంగా నిజం.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 80వ పుట్టినరోజు వేడుకలను సినీ ప్రేమికులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ పెట్టుబడులు ఆస్తుల గురించి విస్త్రతంగా చర్చ సాగింది. బచ్చన్ నాన్-ఫంగబుల్ టోకెన్లు (NFTలు).. క్రిప్టోస్ వంటి కొత్తగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై తీవ్ర ఆసక్తిని కనబరిచారు. స్మార్ట్ వ్యాపార వ్యూహంలో భాగంగా వాటిలో పెట్టుబడి పెట్టారు.
నవంబర్ 2021లో బచ్చన్ కి చెందిన 'మధుశాల' NFT కలెక్షన్ లు.. ఆటోగ్రాఫ్ చేసిన పోస్టర్ లు సేకరించదగినవి వేలం ప్రారంభ రోజున $520,000 (సుమారు రూ. 3.8 కోట్లు) విలువైన బిడ్ లను అందుకున్నాయి. ఇది రితి ఎంటర్ టైన్ మెంట్ GuardianLink.io జాయింట్ వెంచర్ తో Beyondlife.Club ద్వారా నిర్వహించబడిందనేది ఒక నివేదిక.
అప్పుడు అమితాబ్ బచ్చన్ ఇలా అన్నారు. "ఈ డిజిటలైజేషన్ ప్రపంచంలో NFTలు నా అభిమానులతో మునుపటి కంటే ఎక్కువ సన్నిహితంగా ఉండటానికి అవకాశాల కొత్త రంగాన్ని తెరిచాయి. నా NFTల విజయవంతమైన వేలం నా జీవితంలో కెరీర్ లో అత్యంత విలువైన వ్యక్తిగత మధురక్షణాలు నా మద్దతుదారులచే బాగా స్వీకరించారు. పైగా పెట్టుబడి గా పెట్టారు. ఇది నిజంగా నాకు చాలా గర్వకారణమైన క్షణం. అలాగే నా పరిశ్రమలోని వ్యక్తులు కూడా ఈ కొత్త-యుగం సాంకేతికతతో తమ అభిమానులతో మమేకం కావడానికి మార్గం సుగమం చేస్తుంది" అని తెలిపారు.
NFT ప్లాట్‌ఫారమ్ అయిన గార్డియన్ లింక్ లో COO .. సహ-వ్యవస్థాపకుడు కామేశ్వరన్ ఎలాంగోవన్ ఏమన్నారంటే.."అమితాబ్ బచ్చన్ తన NFTలను విడుదల చేస్తున్నారనే వాస్తవం NFTలు నిజంగా ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించింది. ఇది చాలా అవగాహనను సృష్టించింది. Web3/NFT అంతరిక్షంలోకి భారతదేశం పరివర్తన విషయానికి వస్తే మేము ఒక యుగపు సృష్టి అని పిలుస్తాము.. అని వివరణ ఇచ్చారు.
ఇటీవల మార్చి 2022లో బచ్చన్ తన NFTల కోసం ఆదాయపన్ను శాఖ అధికారులు నోటీసు పంపిన తర్వాత దాదాపు రూ. 1 కోటి మేర అమితాబ్ పన్నులు చెల్లించారు. భారతదేశం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST) ఇంటెలిజెన్స్ హైదరాబాద్ విభాగం ఈ ప్లాట్ ఫారమ్ ను పరిశోధించింది. వ్యత్యాసాలను కనుగొంది.
తదుపరి నోటీసు పంపిన తర్వాత బచ్చన్ దాదాపు రూ. 7 కోట్ల విలువైన NFTల అమ్మకంపై చెల్లించాల్సిన పన్నును చెల్లించినట్లు వివిధ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో నాన్-ఫంగబుల్ టోకెన్ (NFT) మార్కెట్ పూర్తిగా గందరగోళంగా ఉంది. Blockchain అనలిటిక్స్ కంపెనీ Dune Analytics నుండి వచ్చిన డేటా ప్రకారం మార్కెట్ 2022 ప్రారంభంలో $17 బిలియన్ల గరిష్ట స్థాయి నుండి అదే సంవత్సరం సెప్టెంబర్‌లో $470 మిలియన్లకు 97 శాతం పడిపోయింది.
క్రిప్టోతో బచ్చన్ ఎఫైర్ అక్టోబర్ 2021లో అమితాబ్ బచ్చన్ క్రిప్టో ఎక్స్ఛేంజ్ కాయిన్ డిసిఎక్స్ ద్వారా ఆమోదం కోసం ప్రయత్నించారు. క్రిప్టో ఎక్స్ఛేంజ్ బిగ్ బి వంటి గుర్తింపు పొందిన పబ్లిక్ ఫిగర్ తో అనుబంధించడం ద్వారా క్రిప్టోకరెన్సీ గురించి విస్త్రతంగా ప్రచారం చేయాలని భావించింది.
2017లో ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. 2015లో సింగపూర్ లోని వెంకట శ్రీనివాస్ మీనవల్లికి చెందిన మెరిడియన్ టెక్ పీటీ అమితాబ్ బచ్చన్ అతని కుమారుడు అభిషేక్ బచ్చన్ నుండి సుమారు $250000 (సుమారు రూ. 1.6 కోట్లు) పెట్టుబడిని పొందింది. తండ్రీ కొడుకుల ద్వయం ఈ పెట్టుబడి నుండి 2017లో $17.5 (రూ. 112 కోట్లు) మిలియన్లను సంపాదించారని సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.