క్రియేటివ్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ పూర్తిగా మనసు పెట్టి తీస్తే అది ఒక శివ, ఒక సర్కార్ అవుతుందని అంటారు. వర్మ టెకింగ్ మీద, అతనికున్న టాలెంట్ పైనా నమ్మకం ఉన్న వారు, దగ్గరా చూసినవారూ చాలామంది చెప్పే విషయమే. అయితే ప్రతీ సినిమాకి నేను ఒకేలా పనిచేస్తాను అని వర్మ నిత్యం చెబుతూనే ఉంటారనుకోండి అది వేరే విషయం. అయితే వర్మ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఒకటైన సర్కార్ కు సంబందించిన సీక్వెల్ సర్కార్-3 ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సమయంలో వర్మ నుంచి మరో అద్భుతం చూస్తామని అంతా భావిస్తోన్న తరుణంలో ఉన్నట్లుండి చిన్నసైజు బాంబు పేలింది!!
అమితాబ్ బచ్చన్ తో సర్కార్ 3 చిత్రాన్ని ఇటీవలే లాంఛ్ చేసి ప్రస్తుతం ముంబయిలో షూటింగ్ చేస్తున్నాడు రాంగోపాల్ వర్మ. మళ్లీ సర్కార్ తో గత వైభవం వస్తుందని రాంగోపాల్ వర్మ అభిమానులు ఆశ పడుతూ ఉంటే, ఈ చిత్రం షూటింగ్ తక్షణం ఆపేయ్యాలంటూ ఒక కోర్టు నోటీస్ వచ్చింది. సర్కార్ ఫ్రాంచైజీ పై సర్వ హక్కులూ తనవేనని, తనని కాదని ఈ చిత్రానికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ తీయడానికి కానీ, అవే గెటప్స్, క్యారెక్టర్స్ వాడడానికి కానీ కుదరదని లీగల్ నోటీస్ ఇచ్చాడు నరేంద్ర హీరావత్. ఇదే క్రమంలో ఈ సినిమాలో పని చేస్తున్న వారందరినీ తక్షణం ఈ ప్రాజెక్ట్ వదులుకోవాలనీ, అలా కానిపక్షంలో చట్టపరమైన చర్యలకు అర్హులు అవుతారని సదరు నిర్మాత పత్రికాముఖంగా హెచ్చరిక జారీ చేసాడు.
అయితే ఇలాంటి కాంట్రవర్సీలు రాంగోపాల్ వర్మకి కొత్తేమీ కాకపోవచు కానీ... కాపీ రైట్ చట్టం చాలా పటిష్టంగా ఉంది అన్న విషయం వర్మకు కూడా తెలుసు. ఈ క్రమంలో వర్మ అనుకున్నట్టుగా సర్కార్ - 3 పూర్తి చేసేసినా తన ఇష్టానికి విడుదల చేసుకోవడం కుదరకపోవచ్చు. దాని ప్రస్తుతానికున్న ఒకే ఒక్క మర్గం ఖచ్చితంగా సర్కార్ పాత నిర్మాతతో రాజీ కుదుర్చుకోవడమే!! అలా కాని పక్షంలో సర్కార్ 3 కి ఏర్పడిన ఆటంకాలు తొలగవు అనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. మరి సర్కార్ కోసం వర్మ దిగి వస్తారా.. బిగ్ బీ స్పందిస్తారా.. నరేంద్ర హిరావత్ రాజీకొస్తారా.. పోరాడి సాధించుకుంటారా అనేది కాలమే నిర్ణయిస్తుంది!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/