ఐశ్వర్య మీనన్.. సన్నని నడుముతో హై వోల్టేజ్ వైబ్
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న ఐశ్వర్య మీనన్ మరోసారి స్టన్నింగ్ లుక్స్‌తో మెరిసింది.
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న ఐశ్వర్య మీనన్ మరోసారి స్టన్నింగ్ లుక్స్‌తో మెరిసింది. తాజాగా ఆమె పర్పుల్ కలర్ స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో ఫోటోషూట్ చేయగా, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టన్నింగ్ స్టైలింగ్, పెర్ఫెక్ట్ ఫిట్‌నెస్‌తో ఆమె అందాలను మరింత హైలైట్ చేస్తూ లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. అభిమానులు ఆమె లేటెస్ట్ లుక్‌ను చూసి ఫిదా అవుతున్నారు.
పర్పుల్ కలర్ స్లీవ్‌లెస్ టాప్, హై-వైస్టెడ్ ట్రౌజర్స్‌లో ఐశ్వర్య సింపుల్‌గా ఉండేలా స్టైలింగ్ చేసినా, అది ఓ గ్లామరస్ టచ్‌ను తెచ్చింది. ఆమె మేకప్, సన్‌లైట్‌లో మెరుస్తున్న అందం మరింత ఆకర్షణగా మారాయి. కెమెరా ముందు వయ్యారంగా పోజులిస్తూ తన గ్లామర్ యాంగిల్స్‌ను ఎలివేట్ చేయడం, ఆమె ఫొటోషూట్‌లో ప్రత్యేకత.
ఇటీవల ఐశ్వర్య మీనన్ తెలుగు, తమిళ, మలయాళ పరిశ్రమల్లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది. 'స్పై' చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్‌తో కలిసి నటించిన ఆమెకు నటిగా మంచి గుర్తింపు దక్కింది. కానీ ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ కాలేకపోయింది.. ప్రస్తుతం మలయాళంలో 'బజూక' అనే సినిమాతో బిజీగా ఉండగా, తెలుగులో మరో ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుగుతున్నట్లు టాక్.
ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు ఆమె అందాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. స్టన్నింగ్ గ్లామర్..అంటూ కామెంట్స్ పెడుతుంటే, మరికొందరు ఆమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు. స్టైలిష్ అండ్ బోల్డ్ లుక్స్‌తో హాట్ టాపిక్ అవుతున్న ఐశ్వర్య, టాలీవుడ్‌లో మరో ఛాన్స్ దక్కించుకుంటుందేమో చూడాలి.