రమణ గోగుల.. వన్ మోర్ సాంగ్
ఇప్పుడు మ్యూజిక్ సెన్సేషన్ రమణ గోగుల పాడిన మరో సాంగ్.. మహా శివరాత్రి కానుకగా రిలీజ్ చేసింది. నారి మూవీ నుంచి 'గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే' సాంగ్ ను మేకర్స్ బుధవారం ఉదయం విడుదల చేశారు.
సీనియర్ సింగర్ రమణ గోగుల రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్.. గ్రాండ్ గా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని గోదారి గట్టు మీద సాంగ్ ను పాడి ఓ రేంజ్ లో అలరించారు. ముఖ్యంగా.. చెప్పాలంటే ఆ సాంగ్ తోనే మూవీ స్టార్టింగ్ లో ఫుల్ పాపులర్ అయింది.
ఇప్పుడు మ్యూజిక్ సెన్సేషన్ రమణ గోగుల పాడిన మరో సాంగ్.. మహా శివరాత్రి కానుకగా రిలీజ్ చేసింది. నారి మూవీ నుంచి 'గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే' సాంగ్ ను మేకర్స్ బుధవారం ఉదయం విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నారి మూవీ కొత్త పాట.. ఫుల్ గా వైరల్ అవుతోంది. అందరినీ ఆకట్టుకుంటోంది.
మహిళల్ని గౌరవించాలి, ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి, ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో 13-20 ఏళ్ల పిల్లలు ప్రమాదంలో ఉన్నారనే పాయింట్లతో తెరకెక్కిన మూవీ నారి. ఆమని, వికాస్ వశిష్ట, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదిని సహా పలువురు నటీనటులు.. కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
శశి వంటిపల్లి నిర్మించిన ఆ సినిమా.. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్.. గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే పాటను రిలీజ్ చేశారు. వికాస్ వశిష్ట, మౌనిక రెడ్డిపై షాట్ చూసిన ఆ పాటను వినోద్ కుమార్ విన్ను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు.
రమణ గోగుల తన గాత్రంతో మరోసారి ఆకట్టుకున్నారు. హుషారైన వాయిస్ తో మెప్పించారు. దీంతో ఈ సాంగ్ కూడా మంచి హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తోంది. అయితే సాంగ్ బాగుందని మ్యూజిక్ లవర్స్ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రమణ గోగుల వాయిస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని చెబుతున్నారు.
అయితే నారి మూవీ నుంచి ఇప్పటికే పలు సాంగ్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'ఈడు మగాడేంట్రా బుజ్జి..', 'నిశిలో శశిలా..' పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఆర్పీ పట్నాయక్, సునీత, చిన్మయి శ్రీపాద వంటి పలువురు స్టార్ సింగర్స్.. సినిమాలో భాగమయ్యారు. ఇప్పుడు రమణ గోగుల కూడా ఓ సాంగ్ ను ఆలపించారు. మరి మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న నారి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.