చైతూతో మసుద దెయ్యం ఫోటో.. నెట్టింట వైరల్
ఈ పార్టీకి చిత్ర యూనిట్ సభ్యులతో పాటూ పలువురు సినీ తారలు హాజరయ్యారు. ఈ పార్టీలో చైతన్య తో కలిసి ఓ అమ్మాయి దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట ప్రత్యేక ఆకర్షణగా మారింది.
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన సినిమా తండేల్. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆల్రెడీ ఈ సినిమా రూ.110 కోట్లకు పైగా కలెక్షన్లు సంపాదించి, ఇప్పటికీ మంచి ఆక్యుపెన్సీలతో దూసుకెళ్తుంది.
ఎన్నో సినిమాలుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న నాగ చైతన్య, తండేల్ తో సాలిడ్ సక్సెస్ ను అందుకున్నాడు. ఎంతో కాలంగా చైతన్య వెయిట్ చేస్తున్న విజయం ఈ సినిమాతో తనకు దక్కింది. ఇదిలా ఉంటే ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయినందుకు హీరో నాగ చైతన్య ఫిల్మ్ నగర్ లోని ఓ పబ్ లో గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు.
ఈ పార్టీకి చిత్ర యూనిట్ సభ్యులతో పాటూ పలువురు సినీ తారలు హాజరయ్యారు. ఈ పార్టీలో చైతన్య తో కలిసి ఓ అమ్మాయి దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మసూద సినిమాలో దెయ్యంగా నటించి అందరినీ ఎంతగానో భయపెట్టిన బాంధవి శ్రీధర్. మసూదలో దెయ్యంలా కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం బాంధవి తన గ్లామర్ ఫోటోలతో అందరినీ ఆకట్టుకుంటుంది.
2019లో మిస్ ఇండియా రన్నరప్ అయిన బాంధవి, మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019గా కూడా నిలిచింది. అలాగే మిస్ ఆంధ్రపదేశ్2019గా కూడా బాంధవి గెలిచింది. మొదట్లో మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాల్లో నటించిన బాంధవికి మసూద సినిమా వరకు సరైన ఫేమ్ రాలేదు. మసూద తర్వాతే బాంధవి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయింది.
ఇప్పుడు చైతన్య ఇచ్చిన స్పెషల్ పార్టీలో మెరిసి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ పార్టీకి నిర్మాతలైన స్వప్న, నాగవంశీ, అల్లు అరవింద్, బన్నీ వాస్, సుప్రియ, బాపినీడుతో పాటూ డైరెక్టర్ కార్తీక్ దండు, గీతా ఆర్ట్స్ సన్నిహితులు కూడా హాజరయ్యారు.