తన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిని పూర్తి చేయడంలో ఫుల్లు బిజిగా ఉన్న నందమూరి బాలకృష్ణ.. 101వ సినిమాపై కూడా ఇప్పటికే క్లారిటీతో ఉన్నారనే విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 'రైతు' చిత్రాన్ని తెరకెక్కించేందుకు బాలయ్య సిద్ధపడ్డారని సిగ్నల్స్ ముందు నుంచీ ఉన్నాయి. ఇందుకు తగ్గట్లుగానే ఈ మూవీలో కీలకమైన ఓ పాత్ర(రాష్ట్రపతి) కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను పర్సనల్ గా కలిసి మాట్లాడారు బాలయ్య.
అయితే.. రైతు మూవీలో నటించేందుకు బిగ్ బీ వీలు పడటం లేదు చెప్పారన్నది లేటెస్ట్ టాక్. కొన్ని వారాల క్రితం సర్కార్ 3 సెట్స్ లో బాలయ్య స్వయంగా కలిసినప్పుడు కూడా.. 'ప్రయత్నిస్తాను' అంటూ బిగ్ బీ చెప్పిన మాటను.. ఓకే చెప్పేశారనే స్థాయిలోనే మీడియాకు లీకులివ్వడం జరిగిందట. అయితే.. అప్పుడు కాస్త సుముఖంగానే ఉన్న అమితాబ్.. ప్రస్తుతం తన షెడ్యూల్స్ ప్రకారం చూస్తే.. ఏ మాత్రం అవకాశం లేదని తేల్చేశారట.
అయితే.. వచ్చే ఏడాది జూలై వరకూ ఆగితే మాత్రం రైతు అడిగినట్లుగా డేట్స్ కేటాయించగలనని చెప్పారట బచ్చన్ సాబ్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరు నెలలు షూటింగ్ వాయిదా వేసుకునే సిట్యుయేషన్ లేదు కాబట్టి.. బిగ్ బీ లేకుండానే ప్రొసీడ్ అయిపోవాలని రైతు యూనిట్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/